మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (17:33 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యం పాలయ్యారనీ, అందుకే మంత్రివర్గ సమావేశం నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అర్థాంతరంగా వెళ్లిపోయారంటూ సాగుతున్న ప్రచారంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన తల్లి ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. 
 
మంగళవారం ఉదయం కొందరు సామాజిక మాధ్యమం యూజర్లు అంజనాదేవి ఆరోగ్యం బాగోలేదని ఆమె ఆస్పత్రిలో చేరారంటూ కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. చిరంజీవి తల్లికి అస్వస్థత, చిరంజీవి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అంటూ ప్రచారం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 
 
ఈ వార్తలపై ఆయన స్పందించారు. "మా అమ్మ అంజనాదేవి ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె అనారోగ్యంతో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వదంతులు నమ్మొద్దు" అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్ధారించుకోకుండా వార్తలు ప్రచారం చేయొద్దని పలువురు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశం జరుగుతుండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం మధ్యలో అర్థాంతరంగా లేచి వెళ్లిపోయారు. దీంతో తల్లి అంజనాదేవికి అనారోగ్యంగా ఉండటం వల్లే ఆయన మీటింగ్ మధ్యలో వెళ్లిపోయారంటూ ప్రచారం సాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments