Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దేవర' 3 రోజుల్లో రూ.304 కోట్లు? - నిజమేనా? సోషల్ మీడియాలో చర్చ!

ఠాగూర్
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (20:25 IST)
"దేవర" చిత్రం మూడు రోజుల్లో రూ.304 కోట్ల మేరకు వసూలు చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే, నిజంగా వచ్చిన వసూళ్లేనా, నిజాయితీగా సినిమా టీమ్ ఇస్తున్న సమాచారమేనా అని ఓ పక్క చర్చ సాగుతుంది. 
 
నిజానికీ ఏ సినిమా బాగున్నా టాలీవుడ్ సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా తమ స్పందనను తెలియచేస్తూ ఉంటారు. చిరంజీవి, మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలు మొదలుకొని.. రాజమౌళి వంటి అగ్ర దర్శకుల వరకు ఏ సినిమా బాగున్నా, అది చిన్నదా పెద్దదా అన్న వత్యాసం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. 
 
'దేవర' విడుదలై వారాంతం ముగిసినా ఇంకా ఆ తరహా స్పందన రాలేదు. బిజీగా ఉండి వీరింకా సినిమా చూసి ఉండలేదనుకోవచ్చు. కానీ తొలిరోజు రాజమౌళి థియేటర్‌లో 'దేవర'ను చూసినా.. ఇంకా ఆయన మాత్రం స్పందించలేదు. అంటే జక్కన్నకు సినిమా నచ్చలేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి కొడుకు కార్తికేయ, ఎన్టీఆర్.. ‌23 ఏళ్ల రాజమౌళి సెంటిమెంట్‌ను 'దేవర'తో బీట్ చేశాడని ట్వీట్ అయితే వేశారు. 
 
కానీ, 'దేవర' ఎందుకో ఎన్టీఆర్ హార్డ్ కోర్ అభిమానులకు కూడా ఆకట్టుకోలేదని పబ్లిక్ టాక్ చూస్తుంటేనే కనిపిస్తొంది. 'దేవర' రిలీజ్ ముందు వరకు టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సెలబ్రిటీలు.. 'దేవర' రిలీజ్ అనంతరం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. 'దేవర' పూర్తిస్థాయిలో ఎవరిని ఆకట్టుకోలేకపోయిందా అనే డిస్కషన్ సోషల్ మీడియా వేదికగా సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. కన్నతండ్రిని లేపేశారు...

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments