Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్ బాస్ 2'లో పాల్గొనే సెల‌బ్రిటీలు వీళ్లే.. యాంకర్లు దీప్తి-శ్యామల

స్టార్ మా టీవీ నిర్వ‌హించిన బిగ్ బాస్ 1 ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీనికి ప్ర‌ధాన కార‌ణం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హాస్ట్‌గా చేయ‌డం అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 2కి నేచుర‌ల్ స్టార్ నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (22:37 IST)
స్టార్ మా టీవీ నిర్వ‌హించిన బిగ్ బాస్ 1 ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీనికి ప్ర‌ధాన కార‌ణం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హాస్ట్‌గా చేయ‌డం అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 2కి నేచుర‌ల్ స్టార్ నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న బిగ్‌బాస్‌’ సీజన్-2 ఆదివారం నుంచి ప్రసారం కాబోతోంది. 
 
వంద రోజులపాటు 16 మంది సెలబ్రిటీలు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో ఉండబోతున్నారు. గత సీజన్‌తో పోల్చితే ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని నిర్వాహకులు ఇప్పటికే తెలియ‌చేసారు. అయితే... ఈ సీజ‌న్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవ‌రు వెళ్ల‌బోతున్నారు అనేది హాట్ టాపిక్ అయ్యింది. 
 
తాజా స‌మాచారం ప్ర‌కారం... ఇందులో గీతామాధురి, అమిత్ తివారి, టివీ 9 యాంక‌ర్ దీప్తి, త‌నీష్‌, బాబు గోగినేని, భాను, రోల్ రిదా, యాంక‌ర్ శ్యామ‌ల‌, కిరిటి ధ‌మ‌రాజు, దీప్తి సునాయ‌న‌, కౌశ‌ల్, తేజ‌స్వి, స‌మ్రాట్, గ‌ణేష్ (కామ‌న్ పీపుల్) సంజ‌న (కామ‌న్ పీపుల్) నూత‌న్ నాయుడు (కామ‌న్ పీపుల్) పాల్గొంటున్నారు. 
 
ఇందులో పాల్గొంటున్న సెల‌బిట్రీల‌ను చూస్తుంటే... బిగ్ బాస్ సీజ‌న్ 1 కంటే పెద్ద స‌క్స‌స్ అయ్యేలా క‌నిపిస్తుంది. మ‌రి... బిగ్ బాస్ 2 ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments