Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ కళ తప్పింది... జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ కనిపించాడు షో పుల్ జోష్

బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొంటున్న వారి కంటే బయట ఉండి వారిని గమనిస్తున్న జూనియర్ ఎన్టీఆరే ఆ షోకి ఫుల్ జోష్ తెప్పిస్తున్నారు. ప్రారంభ ఎపిసోడ్‌లో పార్టిసిపెంట్స్‌ని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించి తాళంవేస

Webdunia
సోమవారం, 24 జులై 2017 (03:05 IST)
బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొంటున్న వారి కంటే బయట ఉండి వారిని గమనిస్తున్న జూనియర్ ఎన్టీఆరే ఆ షోకి ఫుల్ జోష్ తెప్పిస్తున్నారు. ప్రారంభ ఎపిసోడ్‌లో పార్టిసిపెంట్స్‌ని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించి తాళంవేసిన ఎన్టీఆర్ తర్వాత వారం రోజులుగా కనిపించలేదు. దీంతో అంత ప్రముఖులు కాని బిగ్ బాస్ షో భాగస్వాముల నిర్బంధ జీవితం ప్రేక్షకులకు పెద్దగా క్రేజీ తెప్పించలేదు.మళ్లీ ఈ శనివారం బిగ్‌బాస్ షోలో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా షోకు కళ తెప్పించారు. ఎన్టీఆర్ కనిపించగానే ప్రేక్షకులు స్పందిస్తున్నారంటే.. ఎన్టీఆర్ వెండి తెరమీదే కాదు... బుల్లి తెర మీద కూడా సత్తా చాటుతున్నాడనే చెప్పాలి. 
 
వారం రోజులుగా కళ తప్పిన ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోకు ఎన్టీఆర్ ఎంట్రీతో వెలుగులు వచ్చాయి. గత ఆదివారం 14 మంది పార్టిసిపేట్స్‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించిన ఎన్టీఆర్ మళ్లీ ఈ శనివారం వాళ్లకు కనిపించారు. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌తో పిచ్చాపాటి ముచ్చటించారు. ఈ వారం రోజులు ఎవరెవరు ఏమేం చేశారనే విషయాన్ని బయటి నుంచి గమనిస్తున్న ఎన్టీఆర్.. ఒక్కొక్క పార్టిసిపేట్‌ను ప్రశ్నిస్తూ కామెడీ పుట్టించారు.
 
బర్నింగ్ సంపూర్ణేష్ బాబు విషయానికి వచ్చిన ఎన్టీఆర్ సన్నపిన్ను ఛార్జర్ గురించి ప్రస్తావించారు. హరితేజ-ఆదర్శ్ మధ్య డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో సన్నపిన్ను ఛార్జర్ గురించి అడిగారని బర్నింగ్ స్టార్‌కు చెబుతూ షోలో నవ్వులు పూయించాడు ఎన్టీఆర్. ఇష్యూ సీరియస్‌గా వెళ్లిపోతోందని డౌట్ వచ్చి దాన్ని ఆపడానికి ఏం చేయాలో అర్థంకాక అలా చేశానని సంపూ వివరించాడు. 
 
అది విన్న ఎన్టీఆర్ ‘‘కాదండీ.. ఇప్పుడు మీ ఇల్లుంది. మీకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ల మధ్య చిన్న గొడవ జరిగింది. మీరు ఏం చేస్తారు’’ అని ప్రశ్నించగా ఆపుతాను అని సంపూ సమాధానమిస్తాడు. అప్పుడు మళ్లీ ఎన్టీఆర్ కలుగజేసుకుని ‘ఆపుతారు.. ఎలా ఆపుతారు సన్నపిన్న ఛార్జర్ అంటారా లేకపోతే..’ అంటూ నవ్వేశాడు. మొత్తానికి బిగ్‌బాస్ షో చూసే ప్రేక్షకులు పార్టిసిపేట్స్ చేసే పనులకంటే ఎన్టీఆర్ టైమింగ్‌కు, జోకులకే బాగా నవ్వుకుంటున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments