Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో సినిమా తీసేందుకు రెడీ అవుతున్న బిచ్చగాడు దర్శకుడు..!

బిచ్చగాడు సినిమా ప్రభంజనం సృష్టించిన దర్శకుడు శశి తెలుగులో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవలే ఓ యంగ్ హీరోకు కథ చెప్పినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ సినిమ

Webdunia
ఆదివారం, 14 మే 2017 (13:22 IST)
బిచ్చగాడు సినిమా ప్రభంజనం సృష్టించిన దర్శకుడు శశి తెలుగులో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవలే ఓ యంగ్ హీరోకు కథ చెప్పినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తోంది. బిచ్చగాడు చిత్రం తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయ్యింది. కేవలం 30 లక్షల పెట్టుబడితో రూ.20 కోట్లకు పైగా లాభాలను ఆర్జించి పెట్టింది. బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనీకి మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో తెలుగులో సినిమా చేయాలనే ఆలోచనకు వచ్చాడు... శశి.
 
కాగా శశి 1998లో సొల్లామలే అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 7 సినిమాలకు దర్శకత్వం వహించాడు. తెలుగులో వెంకటేష్ నటించిన శీను సినిమాకు కూడా దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు. అయితే బిచ్చగాడు సినిమానే శశికి మంచి గుర్తింపు సంపాదించిపెట్టింది. టాలీవుడ్‌లో మాత్రం రూ.25 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments