భోళా శంకర్ సినిమా ప్రారంభం.. అన్నాచెల్లెల్ల అనుబంధంతో..

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:17 IST)
మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా భోళా శంకర్ సినిమా ప్రారంభమైంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో వేడుకగా జరిగింది.

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, హరీశ్‌ శంకర్‌, బాబీ, గోపీచంద్‌ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ఈ వేడుకలో పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. ముహుర్తపు షాట్‌లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్‌ కొట్టారు.
 
తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇందులో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేశ్‌ కనిపించనున్నారు. అలాగే మెగాస్టార్‌కు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు. మణిశర్మ కుమారుడు మహతి సాగర్‌ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రవాసీ రాజస్థానీ దివస్ లోగోను ఆవిష్కరించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

పోలీస్ స్టేషన్‌కి సాయం కోసం వెళ్తే.. అందంగా వుందని అలా వాడుకున్నారు..

వేడిపాల గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.. ఎక్కడ?

కడపలో భారీ స్థాయిలో నకిలీ జెఎస్‌డబ్ల్యు సిల్వర్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆ యాప్‌లో కనెక్ట్ అయ్యాడు- హైదరాబాద్‌లో వైద్యుడిపై లైంగిక దాడి.. బయట చెప్తే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments