Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌ నటుల వరుస ఆత్మహత్యలు.. ఉరేసుకుని అనుపమ పాఠక్ బలవన్మరణం

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (10:14 IST)
Mumbai Actress
బాలీవుడ్‌ నటుల వరుస ఆత్మహత్యలు ముంబైలో కలకలం రేపుతున్నాయి. భోజ్‌పురి సినీ నటి అనుపమ పాఠక్ తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉత్తర ముంబై శివారులోని దహిసార్‌లో ఆమె ఉరిపెట్టుకున్నట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. బీహార్‌లోని పూర్ణియా జిల్లాకి చెందిన 40 ఏళ్ల అనుపమ పాఠక్... ముంబైకి వచ్చి భోజ్‌పురి సినిమాలు, టీవీ షోల కోసం పనిచేస్తున్నారు. 
 
కాగా ఆమె ఆత్మహత్యకు ముందు ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకున్నారు. తాను మోసపోయాననీ.. ఎవ్వరినీ నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకం గురించి పదేపదే ప్రస్తావించడంతో పాటు, తనకు సాయం చేయగలిగే మిత్రులు ఎవరూ లేరంటూ ఆమె వీడియోలో పేర్కొన్నారు.
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో యావత్ సినీ ప్రపంచం షాక్‌లో ఉన్న తరుణంలోనే పాఠక్ ఆత్మహత్య మరింత విషాదంలోకి నెట్టింది. జూన్ 14న బంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. అదేనెల 9న సుశాంత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఓ బహుళ అంతస్తుల భవనం మీది నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. 
 
దీనికి నెల రోజుల ముందు మే 15న టీవీ నటుడు మన్మీత్ గ్రేవల్ ముంబైలోని తన నివాసంలో ఉరేసుకున్నారు. 44 ఏళ్ల మరో బుల్లితెర నటుడు సమీర్ శర్మ ఈ నెల 5న తన నివాసం బలవన్మరణానికి పాల్పడ్డారు. ముంబై శివారులోని మలద్‌లో ప్రస్తుతం ఆయన ఒక్కరే నివసిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments