Webdunia - Bharat's app for daily news and videos

Install App

షార్ట్ కట్ లో వెళితే ఏం జరుగుతుందనేది భరతనాట్యం కథ : సూర్య తేజ ఏలే

డీవీ
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (16:35 IST)
Surya Teja Ele
'భరతనాట్యం' ఫిక్షనల్ స్టొరీ. కానీ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకునేలా వుంటుంది. ఒక మనిషి షార్ట్ కట్ లో వెళితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా పాయింట్. పర్శనల్ గా ఫీలైన స్ట్రగుల్స్ ని కామికల్ గా చేసి రాసింది. కమర్షియల్ గా చాలా మంచి ఎంటర్ టైనర్. అని హీరో సూర్య తేజ ఏలే తెలిపారు.
 
దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక.  ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో హీరో సూర్య తేజ ఏలే విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
-నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో కి రావాలి, డైరెక్షన్ చేయాలనే ఆసక్తివుండేది. కాలేజ్ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథలు రాయడం,  నెరేట్ చేయడం.. ఇలా స్ట్రగులింగ్ లో వున్న సమయంలో హితేష్ గారికి నేను చెప్పిన కథ నచ్చింది. తర్వాత దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారికి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. ఈ సినిమాకి మీరు డైరెక్షన్ చేస్తే బావుంటుంది కోరాను. కథ నచ్చి అంగీకరించారు. కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుటుంది. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత చేయడం జరిగింది. అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, వైవా హర్ష పాత్రలు రాసినప్పుడే వారినే అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. డీవోపీ వెంకట్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వివేక్ సాగర్ గారు రావడంతో సినిమా స్కేల్ మరింత గా పెరిగింది.  
 
-కెవిఆర్ మహేంద్ర గారితో పరిచయం వుంది. నేను ఆయనకు ఒక డ్రాఫ్ట్ స్క్రిప్ట్ ఇచ్చాను. అది ఆయనకు నచ్చింది. అప్పటికే ఆయన క్రైమ్ జోనర్ లో ఓ కథ అనుకుంటున్నారు. ఈ కథ ఆయనకు నచ్చుతుందనే నమ్మకంతో చెప్పాను. నా నమ్మకం నిజమైయింది. ఆయనకి నచ్చింది. కెవిఆర్ మహేంద్ర గారు చాలా క్లోజ్ గా వుంటారు. చాలా కామ్ గా వుంటారు. చాలా ఫ్రీడం ఇస్తారు. ఐడియాలని చాలా స్వేఛ్చగా షేర్ చేసుకుంటారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు.
 
-వినయ్ వర్మ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. ఏడాది పాటు అన్నపూర్ణలో ఫిల్మ్ కోర్స్ చేశాను.  
 
-మా నాన్న గారు (ధని ఏలే) సినీ పరిశ్రమలో పాతికేళ్ళుగా పబ్లిసిటీ డిజైనర్ గా పని చేస్తున్నారు. నేను పెయిటింగ్ లో ఫైన్ ఆర్ట్స్, మాస్టర్స్ చేశాను. సినిమా టైటిల్స్ రాస్తుంటాను. డిజైనింగ్, ఎడిటింగ్ లో అనుభవం వుంది. కోవిడ్ తర్వాత రైటింగ్ లోకి వచ్చాను.
 
-హితేష్ గారు ముందు నన్ను మనిషిగా నమ్మారు. కథ విని సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. హితేష్, పాయల్ గారు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. ఎక్కడా రాజీపడకుండా మంచి ప్యాడింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని నిర్మించారు. ఒక చిన్న సినిమాకి ఈ స్థాయిలో పబ్లిసిటీ జరుగుతుందంటే అది నిర్మాత ప్రోత్సాహంతోనే సాధ్యపడుతుంది.
 
-నాకు పర్శనల్ గా కృష్ణ వంశీగారు, త్రివిక్రమ్ గారు అంటే ఇష్టం. అలాగే చాలా మంది నుంచి స్ఫూర్తి పొందాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments