Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలికి తర్వాత భరత్ అనే నేను: అత్యధిక వసూళ్లతో?

బాహుబలి సిరీస్ సినిమాలో తొలి రోజే అతి భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ''భరత్ అనే నేను'' సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే కలెక్

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (16:47 IST)
బాహుబలి సిరీస్ సినిమాలో తొలి రోజే అతి భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ''భరత్ అనే నేను'' సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే కలెక్షన్స్ సాధించింది. విడుదలైన రెండు రోజుల్లోనే మహేశ్ బాబు కొత్త సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి, అత్యంత త్వరగా ఈ రికార్డును సాధించిన సినిమాగా ''భరత్‌ అనే నేను' నిలిచిందని సినీ యూనిట్ వెల్లడించింది. 
 
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన అన్ని ప్రాంతాల్లో దూసుకుపోతోంది. అమెరికాలో ఇప్పటివరకు 2 మిలియన్‌ డాలర్లు రాబట్టిన ఈ సినిమా మొత్తం వసూళ్ల పరంగా ''బాహుబలి'' తర్వాతి స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.
 
దీనిపై సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాదిలో విడుదలైన సినిమాల్లో తొలిరోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా మహేశ్‌ సినిమా నిలిచిందని తెలిపారు. 
 
ఆస్ట్రేలియాలో విడుదలైన సినిమాల జాబితాలో బాలీవుడ్‌ సినిమా ''పద్మావత్‌'' మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 సినిమాల్లో పద్మావత్, భాగి, సజ్జన్ సింగ్ రంగ్రూత్‌లతో పాటు రెండు తెలుగు సినిమాలు రంగస్థలం, భరత్ అనే నేను కూడా వున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments