Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్-2 నుంచి భానుశ్రీ ఔట్.. బోరున విలపించిన సునయన

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యతగా గత కొన్ని వారాలుగా తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తున్న రియాల్టీ షో 'బిగ్‌బాస్-2'. ఈ షో నుంచి గత కొన్ని వారాలుగా ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్నారు. తాజాగా అంటే ఆదివారం మరొకరు ని

Webdunia
సోమవారం, 16 జులై 2018 (09:01 IST)
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యతగా గత కొన్ని వారాలుగా తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తున్న రియాల్టీ షో 'బిగ్‌బాస్-2'. ఈ షో నుంచి గత కొన్ని వారాలుగా ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్నారు. తాజాగా అంటే ఆదివారం మరొకరు నిష్క్రమించారు. ఆమె పేరు భానుశ్రీ.
 
హౌస్‌లో టఫ్ కంటెస్టెంట్‌గా ఉన్న భాను అనూహ్య రీతిలో ఎలిమినేషన్‌లోకి వచ్చింది. టాస్క్‌లో భాగంగా అమిత్‌ను ఒప్పించడంలో విఫలమైన భానుశ్రీ ఎలిమినేషన్‌లోకి వచ్చింది. హౌస్‌లో చక్కగా ఆడుతున్న ఆమెపై పెద్దగా ఫిర్యాదులు లేనప్పటికీ హౌస్‌మేట్ కౌశల్‌పై చేసిన పరుష వ్యాఖ్యలు ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణంగా నిలిచాయి. హౌస్‌లో ఆమె చేసిన రచ్చ భానుకు మైనస్ అయింది. ఫలితంగా ఆమెకు ఓట్లు రాకపోవడానికి అదే కారణమని తెలుస్తోంది.
 
ఈ కారణంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించిన భానుశ్రీ... హౌస్ నుంచి బయటకు వెళ్తుంటే జట్టు మొత్తం భావోద్వేగానికి గురైంది. దీప్తి సునయన ఆమెను పట్టుకుని బోరున ఏడ్చేసింది. చివరగా విజిల్ వేసి నవ్వుతూ హౌస్ నుంచి బయటకు వెళ్లిన సునయన 'బిగ్ బాంబ్‌'ను అమిత్, కౌశల్‌పై ప్రయోగించింది. ఇందులో భాగంగా అమిత్ కుర్చీలోనే కూర్చోవాలి. అతడు ఎక్కడికి వెళ్తే, అక్కడికి కౌశల్ ఆ కుర్చీని తీసుకెళ్లాలి అంటూ ఓ టాస్క్ ఇచ్చి నిష్క్రమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments