Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్తాంబుల్‌లో దోపిడీకి గురైన బాలీవుడ్ బుల్లితెర నటి

బాలీవుడ్ బుల్లితెర నటి సౌమ్య టాండన్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో దోపిడీకి గురైంది. ఆమె ఎక్కిన క్యాబ్ డ్రైవరే ఈ దోపిడీకి పాల్పడ్డాడు. ఆమెను బెదిరించి ఆమె వద్ద రూ.60 వేలును తీసుకుని పారిపోయాడు. తాజాగ

Webdunia
ఆదివారం, 11 జూన్ 2017 (15:02 IST)
బాలీవుడ్ బుల్లితెర నటి సౌమ్య టాండన్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో దోపిడీకి గురైంది. ఆమె ఎక్కిన క్యాబ్ డ్రైవరే ఈ దోపిడీకి పాల్పడ్డాడు. ఆమెను బెదిరించి ఆమె వద్ద రూ.60 వేలును తీసుకుని పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
'భాబీజీ ఘర్ పర్ హై' అనే టీవీ సీరియల్ నటి సౌమ్యా టాండన్ నటిస్తోంది. ఈమె తన స్నేహితులతో కలిసి ఇస్తాంబుల్‌కు విహార యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో బయటకు వెళ్లాల్సి రావడంతో క్యాబ్ ఎక్కింది. ఆమెతో క్యాబ్ డ్రైవర్ అమర్యాదగా ప్రవర్తించాడు. అంతేకాకుండా దారి మధ్యలోనే క్యాబ్‌ను ఆపేసి డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. 
 
మీటర్ ఎందుకు వేయలేదని ఆమె అడగడంతో వాగ్వాదానికి దిగాడు. తర్వాత, అతనితో అనవసరంగా గొడవ ఎందుకు? అని భావించిన ఆమె మూడు యూరోలు తీసి ఇవ్వగా, ఆ కరెన్సీ తమది కాదని చెబుతూ మళ్లీ గొడవకు దిగాడు. అంతే‌కాకుండా ఆమె ఒక్కతే ఉండటంతో ధైర్యంగా ఆమె పర్సులోని 800 యూరోలు (60,000 రూపాయలు) లాక్కొని పారిపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా క్యాబ్ రసీదు లేకపోవడంతో ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments