Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటిగా ఆసక్తి చూపుతున్న బిజినెస్ విమెన్ బెవిలిన్ భరాజ్

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (16:21 IST)
Bevilyn Bharaj
సోలార్ ఎనర్జీ బిజినెస్, బాలీవుడ్ లో బంధువులు, స్నేహితులు పెద్ద స్థాయిలో ఉన్నా  స్వశక్తితో సినిమా రంగంలో నా కెరీర్ ని నిర్మించుకోవాలి అనుకుంటున్నాను అని బెవిలిన్ భరాజ్ తెలిపింది. ముంబై కి చెందిన ప్రముఖ ఫ్యాషన్ మోడల్  బెవిలిన్ భరాజ్ . ఇప్పడు తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. తన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ తెలియజేసింది. 
 
 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  "ఫ్యాషన్ మోడలింగ్ లో అక్కడ నాకు మంచి పేరు, ఒక స్టార్ డం ఉంది. మాది ముంబైలో వ్యాపార కుటుంబం. సోలార్ ఎనర్జీ బిజినెస్ లో ఉన్నాము. "రే ఫోర్స్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్"  కంపెనీ నిర్వహిస్తున్నాము. నేను ఈ సంస్థలో డైరెక్టర్ గా పని చేస్తున్నాను. మా సంస్థ సోలార్ ఎనర్జీని తయారు చేస్తుంది.
 
ఫ్యాషన్ మోడలింగ్ లో అడుగుపెట్టి మంచి విజయం సాధించాను. ఇంటర్నేషనల్ స్థాయి లో పాపులారిటీ సంపాదించాను. ఇప్పుడు సినిమాల్లో నటించడానికి కూడా మా పేరెంట్స్ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నేను నటనలో, డాన్సులలో, ఫైట్స్ లో శిక్షణ పొందాను. సినిమాలు అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. బాహుబలి, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలు  తెలుగు సినిమాని జాతీయ స్థాయికి చేర్చాయి. ఫ్యాషన్ మోడలింగ్ లో ముంబైలో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్ రాలేకపోయాను. ఇప్పుడు సమయం కుదిరింది.
 
తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందుకే హైదరాబాద్ వచ్చాను. పలువురు దర్శక నిర్మాతలను కలిశాను. కలుస్తున్నాను. హీరోయిన్., నెగిటివ్ షేడ్స్  ఉన్న హీరోయిన్., యాక్షన్ హీరోయిన్  ఇలా ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తాను. త్వరలోనే మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను" అన్నారు బెవిలిన్ భరాజ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments