Webdunia - Bharat's app for daily news and videos

Install App

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

దేవీ
శనివారం, 29 మార్చి 2025 (15:10 IST)
Allani Sridhar
సామాజిక అంశాలపై రూపొందిన ఆలోచనత్మక సినిమాలను-నాటి "ప్రతిఘటన" నుండి  నేటి  "బలగం" "కోర్ట్ " వంటి చిత్రాలను,గుండెల్లో పెట్టుకున్నారు.ఆ సినిమాలను విజయవంతం చేసి చరిత్రను తిరగరాశారు. ఈ నేపథ్యంలో... ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న తీవ్రమైన సమస్య – బెట్టింగ్ యాప్‌ల వ్యసనం. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మధ్యతరగతి వారు , ఆడపడుచులు సైతం ఈ మాయ వ్యసనానికి 'లోన్ 'అవుతున్నారు, బలవుతున్నారు. 
 
ఆస్తులు, ఆత్మవిశ్వాసం, కుటుంబ బంధాలు – అన్నీ నాశనమవుతున్నాయి. అప్పుల ఊబిలో కొందరు జీవితాన్ని కోల్పోయే దాకా వెళ్తున్నారు. ఈ ఆవేదనను , సమస్యను పరిష్కారాన్ని కూడా వెండితెరపై చూపుతూ, అందరికీ అవగాహన కలిగించే లక్ష్యంతో "బెట్టింగ్" అనే సామాజిక ప్రయోజనాత్మక చిత్రం రూపొందుతోంది.
 
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నది అల్లాణి శ్రీధర్ . గతంలో "కొమరం భీమ్", "రగులుతున్న భారతం" వంటి చిత్రాలకు ఉత్తమ నిర్మాత, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత మరియు ఉత్తమ దర్శకుడిగా రాష్ట్రప్రభుత్వ అవార్డులు పొందిన రచయిత దర్శకుడు.
 శతాధిక చిత్రాల విజయవంతమైన  నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత, సౌత్ ఇండియా సినీ లెజెండ్ శ్రీ సి.కల్యాణ్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ విలువైన సూచనలతో మార్గ నిర్దేశనం  చేస్తున్నారు.
ఉగాది పర్వదినం రోజున పూజా కార్యక్రమంతో ఈ చిత్రం నిర్మాణం ప్రారంభం కానుంది.
 
ప్రముఖ సాంకేతిక నిపుణులు, తెలుగు సినీ పరిశ్రమలో నూతన మరియు అనుభవజ్ఞులైన నటీనటులతో ఈ చిత్రం రూపొందనుంది.
భావోద్వేగాలతో నిండిన కుటుంబ నేపథ్యం, ఆత్మవిమర్శను కలిగించే ప్రేమకథ, సమాజానికి ఆయుధంగా నిలిచే సందేశం – ఇవన్నీ ఈ చిత్రానికి పంచప్రాణాలు.
 
ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేసి, త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధమవుతున్నాము.ఈ చిత్రం ఒక వినోదాత్మక ప్రయత్నమే కాదు…ఇది ఒక జాగృతం – ఒక ప్రజా చైతన్యానికి శంఖారావం గా నిలుస్తుందని దర్శకుడు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments