Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నా.. నేను వెళ్ళిపోతున్నానని తండ్రికి చెప్పి హోటల్ గదిలో శవమైన నటి

బెంగాలీ నటి ఒకరు తన తండ్రికి చెప్పి ఆత్మహత్య చేసుకుంది. నాన్నా.. నేను వెళ్లిపోతున్నా.. ఇక కనిపించను అని చెప్పి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె పేరు పాయెల్ చక్రవర్తి. వయసు 38 యేళ్లు. పశ్చిమబెంగాల్‌లోని స

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (08:59 IST)
బెంగాలీ నటి ఒకరు తన తండ్రికి చెప్పి ఆత్మహత్య చేసుకుంది. నాన్నా.. నేను వెళ్లిపోతున్నా.. ఇక కనిపించను అని చెప్పి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె పేరు పాయెల్ చక్రవర్తి. వయసు 38 యేళ్లు. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయారు.
 
పలు బెంగాలీ సినిమాలు, టీవీ సీరియల్‌లు, వెబ్‌ సిరీస్‌ల్లో పాయెల్‌ నటించారు. చోఖేర్‌ తారా తుయ్‌, గొయెండా గిన్నీ వంటి షోలను కూడా ఆమె చేస్తున్నారు. అలాంటి నటి ఉన్నట్టుండి ఈ దారుణానికి పాల్పడటాన్ని బెంగాల్ సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేక పోతోంది. 
 
కాగా, 'మంగళవారం హోటల్‌లో ఓ గది తీసుకున్న పాయెల్‌ బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు' అని హోటల్ సిబ్బంది తెలిపారు. 
 
దీంతో బుధవారం ఎంతగా డోర్‌ కొట్టినా తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే అమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందన్నారు. పాయెల్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. అయితే పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే హత్యా, ఆత్మహత్యా అనేది తేలుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments