Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైసన్ నాయుడు గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (16:50 IST)
Tyson Naidu first look
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు.  #BSS10 తాత్కాలిక టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ను బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'టైసన్ నాయుడు' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ను బాక్సింగ్ ఎక్స్ పర్ట్, లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా పరిచయం చేసే గ్లింప్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది.
 
బాక్సింగ్ రింగ్‌లో నిలబడి, తనను తాను శక్తివంతుడిగా నిరూపించుకోవడానికి, తాను ఎగురుతూ ఎద్దును కొట్టగలనని గొప్పలు చెప్పుకునే సర్దార్ వాయిస్‌ ఓవర్‌తో  గ్లింప్స్ ప్రారంభమవుతుంది. సర్దార్ మాటతో కథానాయకుడు పగలబడి నవ్వి యాక్షన్ లోకి దిగుతాడు. హీరో DSP (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) గా పరిచయం అవుతాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్ టైసన్ మెరుస్తున్న పోస్టర్‌తో అతను బాక్సింగ్ రింగ్‌లోకి ప్రవేశించిన చివరి ఎపిసోడ్ ఆడియన్స్ కు మాస్ స్టఫ్ అందించింది.
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మజల్ద్ బాడీ, గడ్డంతో మాస్‌గా కనిపించి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ బ్లాక్ ఇంటెన్స్, ఫేరోషియస్ గా వున్నాయి.  
 
సాగర్ కె చంద్ర తన హీరోని అద్భుతంగా చూపించడంలో దిట్ట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపించాడు. ముఖేష్ జ్ఞానేష్ తీసిన విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి, సెన్సేషనల్ కంప్పోజర్ భీమ్స్ సిసిరోలియో తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌ను మరింతగా ఎలివేట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ అత్యున్నతంగా వుంది.
 
ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీష్ యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

టీటీడీ బోర్డు సభ్యులుగా నెల్లూరు నుంచి ఇద్దరు మహిళలు

శ్రీవారిని దర్శించుకున్న కొండా సురేఖ.. వైభవంగా దీపావళి ఆస్థానం (Video)

ఏలూరులో బైకుపై వెళ్తుండగా పేలిన దీపావళి ఉల్లిగడ్డ బాంబులు, ఒకరి మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

వరల్డ్ స్ట్రోక్ డే 2024: తెలంగాణలో పెరుగుతున్న స్ట్రోక్ సంఘటనలు, అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments