Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అల్లుడు అదుర్స్" అంటున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (09:12 IST)
'రాక్ష‌సుడు' వంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న చిత్రం 'అల్లుడు అదుర్స్‌'. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది.
 
పండ‌గ సీజ‌న్ల‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ చూసేందుకు ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌తారు. ఈ సంక్రాంతికి 'అల్లుడు అదుర్స్' చిత్రం వారికి స‌రైన చాయిస్ అని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు.
 
బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ స‌ర‌స‌న నాయిక‌లుగా న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్, వెన్నెల కిశోర్‌, స‌త్యా కీల‌క పాత్ర‌ధారులు. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.
 
తారాగ‌ణం:
బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యా 
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: సంరతోష్ శ్రీ‌నివాస్‌
నిర్మాత: సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల‌
స‌మ‌ర్ప‌ణ‌: ర‌మేష్ కుమార్ గంజి
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments