Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్న మరో సినీ వారసుడు

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (17:36 IST)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ టాలీవుడ్‌కు పరిచయమై అడపాదడపా సినిమాలు తీస్తున్నప్పటికీ పెద్దగా హిట్‌లను స్వంతం చేసుకోలేకపోయాడు. జయ జానకీ నాయకా సినిమా ఫర్వాలేదనిపించినప్పటికీ ఆయన ఖాతాలో హిట్‌ను చేర్చలేకపోయింది. అయితే తాజాగా ఆయన నటించిన "రాక్షసుడు" సినిమా విడుదలై ఆ లోటు తీర్చింది. 
 
ఇది తమిళంతో విడుదలై హిట్ సాధించిన "రాచ్చసన్" సినిమాకు రీమేక్. ఈ సినిమా  తర్వాత తన కుమారుడు శ్రీనివాస్‌తో మరో సినిమా తీసే ప్రయత్నాలలో ఉన్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించిన బెల్లంకొండ సురేశ్‌ సరైన దర్శకుడి కోసం చూస్తున్నట్లు చెప్పారు.
 
గత కొంతకాలంగా ఆయన తమ్ముడు సాయి గణేశ్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్‌ సాధినేని తెరకెక్కిస్తున్న సినిమాలో సాయి గణేశ్‌ నటించబోతున్నట్లు సమాచారం. ప్రేమ కథగా రూపొందనున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. ‘హుషారు’ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో కలిసి బెల్లంకొండ సురేశ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా దసరాకు పట్టాలెక్కనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌.
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ‘రాక్షసుడు’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయం అందుకుంది. తమిళ సినిమా ‘రాచ్చసన్‌’కు తెలుగు రీమేక్‌ ఇది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments