Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ బీస్ట్‌ Vs కేజీఎఫ్ 2 పోటీ పడుతుందా?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (17:31 IST)
తమిళ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమా దళపతి ఫ్యాన్సుకు సమ్మర్ ట్రీట్ ఇవ్వనుంది. గతేడాది "మాస్టర్" మూవీతో సూపర్ హిట్ అందుకున్న విజయ్.. ఇపుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో "బీస్ట్" మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి  పూజా హెగ్డే నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా విడుదలై  క్లారిటీ ఇచ్చింది. 
 
ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని తెలిపింది టీమ్. ఇక. బీస్ట్ తెలుగు థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయని అంటున్నారు. దీనికి కారణం ఉంది. ఆయన గత సినిమా మాస్టర్ తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. 
 
ఈ సినిమా 6 కోట్ల మేర బిజినెస్ చెయ్యగా.. దాదాపు 14 కోట్లు మేర వసూళ్లు అందుకొని తెలుగులో కూడా మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఆయన తాజాగా సినిమా బీస్ట్‌కు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా తెలుగు రైట్స్ 11 కోట్లకు అమ్ముడు అయ్యినట్లు టాక్ నడుస్తోంది.
 
ఇక బీస్ట్ ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో.. బాక్సాఫీస్ దగ్గర కెజిఎఫ్‌తో పోటీ పడాల్సి వస్తుంది. కన్నడ సంచలన చిత్రం కేజీఎఫ్: చాప్టర్ 2 ఏప్రిల్ 14న వస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. దీంతో ఒక రోజు గ్యాపులో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి.
 
బీస్ట్ తమిళనాడులో కేజీఎఫ్: చాప్టర్ 2ని డామినేట్ చేస్తుంది. కానీ సినిమా మిగతా అన్ని ప్రాంతాలలో మాత్రం కేజీఎఫ్‌ను డామినేట్ చేయోచ్చని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

బైట యూట్యూబ్ ఛానల్ బోర్డ్, లోపల 10 మంది మహిళలతో స్పా మసాజ్ (video)

విరిగిపోయిన సీట్లో కూర్చొని ప్రయాణం చేసిన కేంద్రమంత్రి...

జీఎస్టీ అధికారి నివాసంలో మిస్టరీ మరణాలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments