Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బంతిపూల జానకి" ట్రైలర్ విడుదల !!

Webdunia
సోమవారం, 23 మే 2016 (11:14 IST)
ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై హిలేరియస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న "బంతిపూల జానకి" పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ధన్ రాజ్-దీక్షాపంత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో "కళ్యాణి-రామ్-తేజ" సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, రాకెట్ రాఘవ, చమక్ చంద్ర, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుదీర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. "హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న మా "బంతిపూల జానకి" ట్రైలర్ కు మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో ఆడియోను విడుదల చేసి.. జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. 
 
ఈ చిత్రానికి ఎడిటింగ్: డా. శివ వై. ప్రసాద్, కెమెరామెన్: జి.ఎల్.బాబు, పాటలు: కాసర్ల శ్యాం, సంగీతం: బోలె, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, నిర్మాతలు: కళ్యాణి-రామ్-తేజ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments