Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి జోగు రామన్న క్లాప్‌తో ప్రారంభమైన "బంజారా టైగెర్స్"

"మూవీ.... జి 9 ఫిలిమ్స్ పతాకంపై సలీమ్, పాఠక్ హీరో హీరోయిన్లుగా ఫయీమ్ సర్కార్ దర్శకత్వంలో సమీనా యాస్మిన్ నిర్మాతగా "బంజారా టైగెర్స్" చిత్రం ఆదివారం ఆదిలాబాద్ మెయిన్ సెంటర్ అంబేద్కర్ చౌక్‌లో అత్యంత భారీ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (15:36 IST)
"మూవీ.... జి 9 ఫిలిమ్స్ పతాకంపై సలీమ్, పాఠక్ హీరో హీరోయిన్లుగా ఫయీమ్ సర్కార్ దర్శకత్వంలో సమీనా యాస్మిన్ నిర్మాతగా "బంజారా టైగెర్స్" చిత్రం ఆదివారం ఆదిలాబాద్ మెయిన్ సెంటర్ అంబేద్కర్ చౌక్‌లో అత్యంత భారీ జన సందోహం మధ్యలో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి తొలిషాట్‌కి సలీమ్, పాఠక్, ప్రసన్నకుమార్, జబర్దస్త్ అప్పరావులపై తెలంగాణ మంత్రి జోగురామన్న క్లాప్ నివ్వగా, ఆదిలాబాద్ ఏం.ఎల్.ఏ. రేఖ నాయక్ కెమెరా స్విచాన్ చేశారు. తొలిషాట్‌కి శ్యాంనాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు ఫయీమ్ సర్కార్ మాట్లాడుతూ మా "బంజారా టైగెర్స్" మూవీ ఇంత భారీగా ఓపెనింగ్ జరుపుకోవటం ఆనందంగా ఉందని, నలుగురు యువకులు జల్సాగా తిరుగుతూ అనుకోకుండా నక్షలైట్ ముద్రతో జైలుకు వెళ్లి తిరిగి వచ్చి ఉరికి ఏమి చేశారు. ఊరు మనకేమి ఇచ్చింది కన్నా ఊరుకి మనమేమి చేశాం అనే కాన్సెఫ్ట్‌తో మంచి ఎంటర్‌టెన్మెంట్‌గా రూపొందిస్తున్నమ్మన్నారు. ఈ చిత్రం ఈ రోజు నుండి 15 రోజులు పాటు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలలో ఫస్ట్ షెడ్యూలు పూర్తి చేసి సెకండ్ షెడ్యూలు డిసెంబరులో హైదరాబాద్ పాటలను వైజాగ్, కాశ్మీర్‌లో చిత్రీకరిస్తామని తెలిపారు. 
 
నిర్మాత సమీనా యాస్మిన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని నాగునాయక్ సంగీత సారథ్యంలో రికార్డింగ్ పూర్తి చేశామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటుందన్నారు. నటుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఓపెనింగ్ చూడటం ఇదే అన్నారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరో నటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ... ఈ చిత్రంతో నాకు మంచి గుర్తింపు లభిస్తుందని ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments