Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు డైరీలు దొరికాయ్.. మన ఇద్దరం తప్పే.. తల్లికి సుశాంత్ కవిత

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:47 IST)
యువ కథానాయకుడు​ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ జూన్‌ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. కానీ సుశాంత్‌ నివాసంలో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. దీంతో పోలీసులు ఇది ఆత్మహత్యా.. లేకపోతే దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ కొనసాగిస్తున్నారు. 
 
ఇప్పటికే సుశాంత్‌ సన్నిహితులతోపాటుగా అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్ చబ్రా నుంచి కూడా పోలీసులు విచారించారు. తాజాగా ముంబై పోలీసులు సుశాంత్‌ నివాసం నుంచి ఐదు పర్సనల్‌ డైరీలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ డైరీలను నిపుణుల సమక్షంలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. దీంతో అతని జీవితంలో ఏం జరిగిందనే దానిపై కొంతమేర స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
 
అలాగే ప్రస్తుతం అమ్మపై సుశాంత్ రాసిన కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. '' అమ్మా నీకు గుర్తుందా.. ఎప్పటికి నాతోనే ఉంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు. అలానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాట ఇచ్చాను. చూడబోతే మన ఇద్దరం తప్పని తెలుస్తుంది అమ్మా" అంటూ రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments