Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలు అమ్ముతున్న "బాలికా వధు" అసిస్టెంట్ డైరెక్టర్!!!

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (17:22 IST)
కరోనా లాక్డౌన్ కోట్లాది మంది ప్రజలు తలరాతలు మార్చేసింది. వారి జీవితాలను తలకిందులు చేసింది. సాధారణ ప్రజలకే కాదు స్టార్లు, సెలెబ్రిటీలు సైతం ఇపుడు పూటగడవడం గగనంగా మారింది. అలాంటి స్టార్ సెలెబ్రిటీల్లో "బాలికా వధు" పాపులర్ టీవీ సీరియల్‌కు అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేసిన రామ్ వృక్షగౌర్‌ ఒకరు. ఈయన ఇపుడు తన కుటుంబ పోషణార్థం కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. రాజ‌స్థాన్‌లో చిన్న‌త‌నంలోనే పెళ్లి జ‌రిగిన ఓ బాలిక (ఆనంది) జీవితం చుట్టూ తిరిగే క‌థాంశంతో తెరకెక్కిన 'బాలికా వ‌ధు' సీరియ‌ల్ 2 వేల‌కు పైగా ఎపిసోడ్స్‌తో గొప్ప ప్ర‌జాద‌ర‌ణ పొందిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'నేను సినిమా చేయాల్సి ఉండ‌గా టైం దొరికింద‌ని స్వ‌స్థ‌లం అజంఘ‌డ్‌కు వ‌చ్చాను. అయితే నేనిక్క‌డికి రాగానే లాక్డౌన్ ప్ర‌క‌టించారు. దీంతో మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి వెళ్లే అవ‌కాశం లేకుండా పోయింది. నిర్మాత ఫోన్ చేసి మ‌న ప్రాజెక్టు‌ను ఆపేశాం. మ‌ళ్లీ షూటింగ్ మొద‌లు పెట్టాలంటే మ‌రో ఏడాది ప‌ట్టొచ్చ‌న్నారు. దీంతో మా నాన్న కూర‌గాయల వ్యాపారం నేను చేయాల‌ని అప్ప‌డే నిర్ణ‌యించుకున్నా. తోపుడు బండిపై తిరుగుతూ కూర‌గాయలు అమ్ముతున్నా. నాన్న చేసే వ్యాపారం గురించి నాకు తెలుసు అందుకే కూర‌గాయ‌లు అమ్ముతున్నాను. ఇలా కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధి లేద‌ని బాధ‌ప‌డకుండా న‌చ్చిన ప‌ని చేసుకుంటూ వెళ్తున్న రామ్ వృక్ష గౌర్ చాలా మంది స్పూర్తిగా తీసుకోవాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments