Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య - బోయ‌పాటి మూవీ ప్రారంభానికి తేదీ ఖ‌రారు..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. బాల‌య్య‌, విద్యాబాల‌న్‌లపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (19:39 IST)
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. బాల‌య్య‌, విద్యాబాల‌న్‌లపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. త్వ‌ర‌లో పాట‌ను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్లో రూపొందిన సింహ‌, లెజెండ్ సినిమాలు ఎంత‌టి విజ‌యాల్ని సాధించాయో అంద‌రికీ తెలిసిందే.
 
అయితే.. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది  కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... అక్టోబ‌ర్ 10న ఈ చిత్రాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నార‌ట‌. 
 
బోయ‌పాటి ఓ వైపు చ‌ర‌ణ్ తో సినిమా చేస్తూనే.. మ‌రోవైపు బాల‌య్య‌తో చేయనున్న సినిమాకి సంబంధించి టీమ్‌తో క‌థాచ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. స్ర్కిప్ట్ వ‌ర్క్ దాదాపు పూర్త‌య్యింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించనుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments