Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నగారి జీవిత చరిత్రలో నటిస్తా.. ఎన్టీఆర్ పాత్రధారిని నేనే : నటసింహా బాలకృష్ణ

విఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా నిర్మించి, అందులో తాను టైటిల్ పాత్రలో నటిస్తానని నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:51 IST)
విఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా నిర్మించి, అందులో తాను టైటిల్ పాత్రలో నటిస్తానని నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ప్రస్తుతం సినిమా కథాంశం కోసం పరిశోధిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు (కృష్ణా జిల్లా పామర్రు మండలం)లో నారా లోకేష్ సహా సాగించిన పర్యటనలో బాలయ్య పైవిధంగా ప్రకటించారు. 
 
"ఎన్టీఆర్‌ జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చాలి. నాకు నిమ్మకూరు, హిందూపురం రెండూ సమానమే"నని అన్నారు. ఎన్టీఆర్ జీవితకథను ఆధారంగా చేసుకుని సినిమా నిర్మిస్తామని, ఇందులో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని, ఈ చిత్రంలో నాన్న జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్ని చర్చిస్తామన్నారు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి నాన్నగారికి సంబంధించిన మరిన్ని విశేషాలను సేకరించి కథను సిద్ధం చేస్తామని బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమా దర్శకుడు, నిర్మాత వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు.
 
అంతకుముందు నిమ్మకూరులో గ్రామంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే, హిందూపూర్‌లో తన పీఏపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోందన్నారు. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా బాలయ్య హెచ్చరించారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments