బాలకృష్ణ "నర్తనశాల" ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (12:52 IST)
గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రారంభమైన చిత్రం "నర్తనశాల". ఇందులో 'అర్జునుడు'గా బాలయ్య నటిస్తున్నారు. 'ద్రౌపది' పాత్రలో సౌందర్యను ఎంపిక చేయగా, భీముడుగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించేలా బాలకృష్ణ స్వీయ దర్శకత్వం వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే, సౌంద‌ర్య హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన త‌ర్వాత ఆగిన ఈ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టివ‌ర‌కు మొద‌లు కాలేదు. ఈ మూవీని ఎప్ప‌టికైన పూర్తి చేయాల‌ని బాలయ్య ఆకాంక్ష‌. 
 
ఈ నేపథ్యంలో అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా (అక్టోబ‌ర్ 24న‌) ఎన్.బి.కె. థియేటర్‌లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది అని బాల‌కృష్ణ స్ప‌ష్టం చేశారు. 
 
తాజాగా న‌ర్త‌నశాల నుంచి బాల‌కృష్ణ‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో బాల‌య్య లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్‌లో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments