Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య బాబు- పవన్ కళ్యాణ్ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా..?

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (17:28 IST)
టాలీవుడ్‌లో బాలయ్య బాబుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. బాలయ్య బాబు తాజాగా నటించిన 'రూలర్' చిత్రంతో 105 చిత్రాలను పూర్తి చేసుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమాల విషయంలో అనేక సార్లు పోటీపడి గట్టి పోటీనిచ్చారు. వీరిద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ స్నేహం ఏమాత్రం తగ్గలేదు. అలాగే నందమూరి వారసుడు జూ.ఎన్టీయార్, చిరంజీవి వారసుడు రామ్‌చరణ్ మంచి స్నేహితులే కాకుండా ఇప్పుడు కలిసి ఒకే చిత్రంలో నటిస్తున్నారు. 
 
గతంలో కూడా చిరంజీవి, సీనియర్ ఎన్టీయార్‌తో కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే చిరు, బాలయ్య బాబు కలిసి నటించిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. రాజకీయాలలో వేర్వేరు పార్టీలలో ఉన్నా, సినిమాల పరంగా పోటీ ఉన్నా, వీరిద్దరి మధ్య ఆ స్నేహ వాతావరణం మాత్రం మారలేదు. అయితే గతంలో పవన్, బాలయ్య బాబు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
పవన్ కళ్యాణ్ సుస్వాగతం చిత్రం ప్రారంభోత్సవానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేడుకకు విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరు కూడా హాజరు కావడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయంగా ప్రత్యర్ధులుగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. కాగా వారిద్దరూ కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments