Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అభిమానిని అన్నా బాలకృష్ణ గారు ఎంతో ప్రోత్సహించారు : దర్శకుడు బాబీ కొల్లి

డీవీ
గురువారం, 23 జనవరి 2025 (09:11 IST)
Bobby, Thaman
డాకు మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ ను అనంతపురంలో గత రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు గుంటూరులో ఒక జాతర లాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్ కి రావడం సంతోషంగా ఉంది. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. అయినప్పటికీ నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు ముందుగా కృతఙ్ఞతలు. 
 
నేను చిరంజీవి గారి అభిమానిని అని చెప్పినా కూడా బాలకృష్ణ గారు నన్ను దర్శకుడిగా ఎంతో ప్రోత్సహించారు. ఆయనకు నిజాయితీగా ఉంటే ఇష్టం. అబద్ధాలకు బాలకృష్ణ గారి దగ్గర చోటు లేదు. మా నాన్న గారు మరణించక ముందు నేను బాలకృష్ణ గారిని కలిసి ఉంటే మా నాన్న నాకు ఇంకా బాగా అర్ధమయ్యేవారు అనిపిస్తుంది. మా నాన్నగారు కూడా ఇలాగే ప్యూర్ హార్ట్ తో ఉంటారు. ప్రేమైనా కోపమైనా అప్పుడే చూపిస్తారు. ఒకప్పుడు నాకు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి లాంటి గొప్ప వ్యక్తి కొడుకుగా తెలుసు, కోట్ల మంది అభిమానులకు దేవుడని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు. 
 
కానీ దగ్గర నుంచి చూసాక బాలకృష్ణ గారిది ఎంత గొప్ప మనసో తెలిసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ గారి అభిమానులు ఫోన్లు, మెసేజ్ లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు. నా డైరెక్షన్ టీంకి, రైటింగ్ టీంకి పేరుపేరునా కృతఙ్ఞతలు. విజయ్ కార్తీక్ గారు విజువల్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అవినాష్ కొల్లా గారి లాంటి గొప్ప ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గారు కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారని విన్నాను. కావేరి, నందిని పాత్రలకు ప్రాణం పోసిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కి థాంక్స్. వేద అగర్వాల్ కి మంచి భవిష్యత్ ఉంది. నేను అభిమానిని కాదు, ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గారికి ఫాలోవర్ ని అయిపోయాను. హీరోని అభిమానించే, దర్శకుడిని నమ్మే.. నిర్మాత నాగవంశీ గారి వల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్ లో బాలకృష్ణ గారితో డాకు మహారాజ్ ని మించిన గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను." అన్నారు.
 
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, "బాలకృష్ణ గారి సినిమాకి సంగీతం చేయడం అనేది నాకు టెన్త్ ఎగ్జామ్ లా ఉంటుంది. ప్రతి సినిమాకి ఇంకా గొప్ప సంగీతం అందించాలనే కసితో పనిచేస్తున్నాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఉత్సాహంతోనే సంగీతం చేస్తున్నాను. బాలకృష్ణ గారు నాకు తండ్రి లాంటి వారు. నన్నెప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. దర్శకుడు బాబీ గారికి సంగీతం మీద మంచి పట్టు ఉంది. ఆయన విజిల్ చేస్తూ పాటను హమ్ చేశారంటే అది హిట్టే. భైరవద్వీపం మా కుటుంబాన్ని ఆదుకున్న సినిమా. డ్రమ్స్ వాయిస్తూ రోజుకి 30 రూపాయలు తీసుకుంటూ బాలకృష్ణ గారి సినిమాతోనే నా సినీ ప్రయాణం మొదలైంది. అలాంటి నేను ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలకు సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ ఎంతో కష్టపడ్డారు. ప్రతి సన్నివేశాన్ని ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి, త్రివిక్రమ్ గారికి, సాయి సౌజన్య గారికి నా స్పెషల్ థాంక్స్. డీఓపీ విజయ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ గా నిలిచారు. డీఓపీ విజయ్, ఎడిటర్లు నిరంజన్, రూబెన్ వల్లే ఇంత మంచి సంగీతం అందించడం సాధ్యమైంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీ గారికి ధన్యవాదాలు." అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments