Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ తర్వాత షూటింగ్ రంగ ప్రవేశంలోకి నందమూరి బాలకృష్ణ

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (21:51 IST)
కరోనా నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో షూటింగులు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రస్తుతం అన్ లాక్ 5 సడలింపుతో పలు హీరోలు తమ షూటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి షూటింగ్ లోకి దిగారు. తనకు ఇప్పటికే రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడో చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
 
ద్వారకా క్రియేషన్ బ్యానర్ పైన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ ముందు ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. తర్వాత లాక్ డౌన్ పడటంతో గత ఏడు నెలలుగా వాయిదా పడింది. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రోజు నుంచి హైదరాబాదులో తదుపరి షూటింగ్ నిర్వహిస్తున్నారు.
 
ఇందులో భాగంగా బాలయ్య కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. బోయపాటి మార్క్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీ మీనా కీలక పాత్ర పోషిస్తుండగా.. మళయాల ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments