Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రేజీ కాంబినేషన్ : మహేష్ - బాలయ్య - బోయపాటిల చిత్రం?

తెలుగు చిత్ర పరిశ్రమ సరికొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులోభాగంగా మల్టీస్టారర్ మూవీలు చేసేందుకు యంగ్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (10:52 IST)
తెలుగు చిత్ర పరిశ్రమ సరికొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులోభాగంగా మల్టీస్టారర్ మూవీలు చేసేందుకు యంగ్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్‌లో "సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు", ఆ తర్వాత వెంకటేష్ - రామ్ కాంబినేషన్‌లో "మసాలా" చిత్రం వచ్చింది. అలాగే, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాంచరణ్ - ఎన్టీఆర్ చిత్రం ఓ చిత్రం రానుందనే వార్త హల్‌చల్ చేస్తోంది. 
 
ఈనేపథ్యంలో ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మరో మ‌ల్టీస్టార‌ర్‌ చిత్రం రానుందనే టాక్ వినిపిస్తోంది. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను టాలీవుడ్ స్టార్ హీరోలు బాల‌కృష్ణ ‌- మ‌హేష్ బాబు కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌కి రంగం సిద్ధం చేసాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే వారిద్ద‌రిని క‌లిసి క‌థ కూడా వినిపించాడ‌ట‌. దీనికి వారిద్దరూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ప్ప‌టికి, పూర్తి స్క్రిప్ట్ పూర్తైన త‌ర్వాత మ‌రోసారి డిస్క‌స్ చేద్దామ‌ని ఆ హీరోలు అన్న‌ట్టు తెలుస్తుంది.
 
ప్ర‌స్తుతం బోయ‌పాటి ఈ క‌థ‌పైనే క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌న్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. త్వ‌ర‌లో రాంచ‌ర‌ణ్‌తో ప్రాజెక్ట్ చేయ‌నున్న బోయ‌పాటి ఈ మూవీ పూర్తైన త‌ర్వాత మ‌ల్టీస్టారర్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ‌తాడ‌ని విశ్వ‌స‌నీయవ‌ర్గాల స‌మాచారం. మ‌హేష్ ఇప్ప‌టికే వెంకీతో క‌లిసి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అనే మల్టీస్టార‌ర్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments