Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ హీరోగా సీతా కళ్యాణ వైభోగమే

డీవీ
సోమవారం, 10 జూన్ 2024 (16:51 IST)
Harshit Reddy, Suman Tej ,Garima Chauhan and others
బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ హీరోగా, గరీమ చౌహన్ హీరోయిన్ గా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ సోమవారం నాడు  బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు.
 
అనంతరం  హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓ మై ఫ్రెండ్ టైంలోనే సతీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ మూవీ ఐడియాను ఏడాదిన్నర క్రితమే చెప్పాడు. సుమన్ అనే కొత్త కుర్రాడు, యంగ్ టాలెంట్‌తో చేస్తున్నానని అన్నాడు. సుమన్ ఫస్ట్ ఫిల్మ్, సతీష్ రెండో చిత్రానికి ఆల్ ది బెస్ట్. నీరూస్ సంస్థకు ఆల్ ది బెస్ట్. రాచాల యుగంధర్‌కు ఆల్ ది బెస్ట్. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
 
 దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘మా సినిమా పాటలు టీ-సీరిస్ ద్వారా రిలీజ్ అయ్యాయి. మా ట్రైలర్ అందరికీ నచ్చింది. హర్షిత్ రెడ్డి గారు బలగం సినిమాతో బలాన్ని ఇచ్చారు. హర్షిత్ రెడ్డి గారి కజిన్ సుమన్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. చరణ్ అర్జున్ గారు మంచి పాటలు ఇచ్చారు. నిర్మాత యుగంధర్ గారికి సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉంది. కొందరికి తాతలు, ముత్తాతల పేర్లు కూడా తెలీదు. కానీ రాముడి గుడి లేని ఊరు ఉండదు. ఆయన బతికిన విధానం వల్లే అందరికీ గుర్తుండిపోయారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశాను. నీరూస్ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రం కోసం యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
 హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన హర్షిత్ అన్నకి థాంక్స్. ఈ చిత్రం 90s కిడ్స్ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ ప్రయాణంలో మాకు అన్ని రకాల ఎమోషన్స్ ఎదురయ్యాయి. మా ఈ ప్రయాణంలో మేం రెండు చిత్రాలు చేశాం. ఆ రెండూ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. మేం పడిన కష్టాన్ని చూసేందుకు థియేటర్‌కు రండి. నీరూస్ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేమ’ని అన్నారు.
 
 నిర్మాత రాచాల యుగంధర్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన హర్షిత్ గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి థాంక్స్. చిన్న చిత్రంగా మొదలైనా.. పెద్ద సినిమాగా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో గగన్ విహారి అద్భుతంగా నటించారు. ఊరికి ఉత్తరాన సినిమాతో సతీష్ గారు విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. సుమన్ తేజ్, గరిమలకు ఈ చిత్రంతో మంచి పేరు రాబోతోంది. పూర్ణాచారి గారు పాటలు అద్భుతంగా రాశారు. జూన్ 21న మా సినిమా రాబోతోంది.ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
 గగన్ విహారి మాట్లాడుతూ.. ‘సతీష్ గారు నాకు మంచి కారెక్టర్ ఇచ్చారు. పాత్రల మధ్య జరిగే కథ ఇది. చాలా బలమైన ఎమోషన్స్ ఉంటాయి. అందరూ థియేటర్లో చూడాల్సిన సినిమా. ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా లాంటి కొత్త వారిని నమ్మి సినిమా తీసిన యుగంధర్ గారికి థాంక్స్. సుమన్, గరిమలతో నటించడం ఆనందంగా ఉంది.  జూన్ 21న రాబోతోన్న మా చిత్రాన్ని అందరూ వీక్షించండి’ అని అన్నారు.
 
 గరిమ చౌహాన్ మాట్లాడుతూ.. ‘మాలాంటి కొత్త వాళ్లని నమ్మి, ఛాన్స్ ఇచ్చిన నిర్మాత యుగంధర్ గారికి థాంక్స్. సతీష్ గారు ప్రతీ సీన్‌ను ఎంతో బాగా వివరించేవారు. పరుశురామ్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. చరణ్ గారు మంచి పాటలు ఇచ్చారు. సుమన్ తేజ్‌తో నటించడం ఆనందంగా ఉంది. గగన్ విహారి అద్భుతంగా నటించారు. మా సినిమా జూన్ 21న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments