Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘బాహుబలి-2’ నిర్మాతలకు సైబర్ నేరస్తుల బెదిరింపులు.. రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్

ఇంతవరకు బాలీవుడ్‌ చిత్రపరిశ్రమకే పరిమితమైన మాఫియా బెదిరింపులు టాలీవుడ్‌కీ పాకుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ చిత్ర నిర్మాతలకు సైబర్‌ నేరగాళ్ల నుంచి బెదిరింపులు వచ్చాయి.

Webdunia
మంగళవారం, 16 మే 2017 (04:21 IST)
ఇంతవరకు బాలీవుడ్‌ చిత్రపరిశ్రమకే పరిమితమైన మాఫియా బెదిరింపులు టాలీవుడ్‌కీ పాకుతున్నట్లు కనిపిస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ చిత్ర నిర్మాతలకు సైబర్‌ నేరగాళ్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. 
 
ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల వసూళ్లు దిశగా దూసుకెళ్తొన్న సందర్భంలో ఆ చిత్రాన్ని ఉపగ్రహం ద్వారా పైరసీ చేశామంటూ సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. 
 
తమకు రూ.2కోట్లు చెల్లించాలని నిర్మాతలను నేరగాళ్లు డిమాండ్‌ చేశారు. దీంతో సీసీఎస్‌ పోలీసులకు చిత్ర నిర్మాతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి పట్నాకు చెందిన రాహుల్‌ వర్మగా పోలీసులు గుర్తించారు. రాహుల్‌ వర్మతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టుచేశారు. నిందితుల్ని రేపు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments