Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యరాజ్‌ తలపై కాలు పెట్టడానికి రెండు రోజులు ఇబ్బందిపడ్జా: బాహుబలి ప్రభాస్

పెద్దస్టార్‌ అయిన సత్యరాజ్‌ ‘బాహుబలి’ చిత్రంలో నా కాలును తన తలపై పెట్టుకునే దృశ్యం చేయడానికి రెండు రోజులపాటు ఇబ్బంది పడ్డా. అయితే దర్శకుడి సహాయంతో అది పూర్తి చేశా’ అని బాహుబలి సినీ హీరో ప్రభాస్ అన్నారు. బాహుబలి-2 చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం చెన

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (02:20 IST)
పెద్దస్టార్‌ అయిన సత్యరాజ్‌ ‘బాహుబలి’ చిత్రంలో నా కాలును తన తలపై పెట్టుకునే దృశ్యం చేయడానికి రెండు రోజులపాటు ఇబ్బంది పడ్డా. అయితే దర్శకుడి సహాయంతో అది పూర్తి చేశా’ అని బాహుబలి సినీ హీరో ప్రభాస్ అన్నారు. బాహుబలి-2 చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం చెన్నయ్‌లో ఒక ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభాస్ పాల్గొన్నారు. రాజమౌళి సృష్టించిన అద్భుత చిత్రం బాహుబలి. అందులో నటించడం గొప్ప అవకాశం. మొదటి భాగానికి అందించినట్లే.. రెండో భాగానికి విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుతున్నా. నేను తమిళనాడులోనే పుట్టా. ఏదో ఒకరోజు నేరుగా తమిళ చిత్రంలో నటిస్తా అని ప్రభాస్ చెప్పారు. 
 
బాహుబలి చిత్రంలో ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగంలో ముంచెత్తిన మూడు నాలుగు అద్బుత దృశ్యాల్లో మాహిష్మతి రాజ్య సేనాని కట్టప్ప అమరేంద్ర బాహుబలి పాదాన్ని తన తలపై పెట్టుకున్న దృశ్యం ఒకటి. ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది ప్రేక్షకులు మూగపోయారంటే అతిశయోక్తికాదు. తన పాత్రలో అలాంటి దృశ్యం ఒకటుందని ప్రారంభంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్‌కి చెప్పేందుకే రాజమౌళి భయపడ్డారని, ప్రభాస్‌కు ఆ బాధ్యత ఇచ్చారన్నది తెలిసిన విషయమే. నా పాదాన్ని మీ తలపై పెట్టే దృశ్యం సినిమాలో ఉందని ప్రభాస్ తడబడుతూనే తెప్పినప్పుడు ఇదీ సీన్ అంటే సత్యరాజ్ ఒక్క ఉదుటున ఉద్వేగంతో అరిచేశారని, సంతోషంగా ఆ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నారని ప్రభాస్ గతంలోనే చెప్పారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments