Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి2 సినిమాపై నా భయాన్ని మొత్తంగా పొగొట్టిన కాంప్లిమెంట్ అది: రాజమౌళి

బాహుబలి 2 సినిమాపై ఒక ఎన్నారై డాక్టర్ నుంచి వచ్చిన అభినందన జీవితకాలంలో మర్చిపోలేనని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. దేశంలో మొదటిసారిగా ముంబైలోనే బాహుబలి రెండోభాగం ప్రీమియంను విడుదల చేయాలని అనుకున

Webdunia
సోమవారం, 29 మే 2017 (05:38 IST)
బాహుబలి 2 సినిమాపై ఒక ఎన్నారై డాక్టర్ నుంచి వచ్చిన అభినందన జీవితకాలంలో మర్చిపోలేనని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. దేశంలో మొదటిసారిగా ముంబైలోనే బాహుబలి రెండోభాగం ప్రీమియంను విడుదల చేయాలని అనుకున్న తమ ప్లాన్ ఏప్రిల్ 27న బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా అనూహ్యంగా మరణించడంతో రద్దయిపోయిందని ఆ సమయంలో తనకు ప్రత్యక్షంగా కలిగిన ఒక అనుభవం బాహుబలి 2 పట్ల భయాలన్నింటినీ పొగొట్టిందని రాజమౌళి తెలిపారు. అదేదో ఆయన మాటల్లోనే విందాం.
 
బాహుబలి-2 సినిమాపై బెస్ట్ కాంప్లిమెంట్ మాటల్లో రాలేదు. బాంబేలో తొలి ప్రీమియర్ కోసం చాలా పెద్ద ఈవెంట్ క్రియేట్ చేశారు. బాలీవుడ్ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ ఈ తొలి ప్రీమియర్ చూసేందుకు రావడానికి ఒప్పుకున్నారు. అయితే అదే రోజు వినోద్ ఖన్నా చనిపోవడంతో ఆ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగోదని రద్దు చేశాం. ఆ ప్రీమియర్ చూడాలని హైదరాబాద్ నుంచి 40 మందిమి వెళ్లాం. బాలీవుడ్‌లో ఏప్రిల్ 27న అంటే ఒక రోజు ముందే ప్రీమియర్ చూపించాలనుకుని వచ్చాం. తీరూ చూస్తే రద్దయింది. మేం వెంటనే తిరిగి రావడానికి  విమాన టిక్కెట్లు దొరకలేదు. మనం ఇక్కడ ఉండగానే మనవాళ్లు ఏపీ, తెలంగాణల్లో సినిమా మనకంటే ముందే చూసేయబోతున్నారే ఎలాగా అని బాధ. మనం కూడా చూడాలి కదా అని రాత్రి 10 గంటలకు మాకోసమే ప్రీమియర్ ఏర్పాటు చేసుకున్నాం. 
 
పదిన్నర గంటలకు సినిమా మొదలైంది. ఆ బాంబే థియేటర్లలో సౌండ్ లేదు. ఇక్కడినుంచి సగంమంది హిందీ, సగం మంది తెలుగువాళ్లం థియేటర్‌కు వెళ్లాం. అప్పటికి నాలుగురోజులుగా మాకు నిద్రలేదు. ప్రమోషన్  కార్యక్రమాల్లో తిరుగుతున్నా. బిక్కుబిక్కుమంటూ సినిమా చూస్తున్నాం. ఏం అర్థం కాలేదు. ఏ స్పందనలూ రావడం లేదు. నా వెనక్కు తిరిగి చూస్తే కొంతమంది నిద్రపోతున్నారు. రోజుల తరబడి నిద్ర లేదు మరి. నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. సినిమా చూడాలని కూడా బుద్దిపుట్టక బయటకు వచ్చి కూచున్నాను. ఇదేమిటి ఇంత తేడా కొట్టింది. ఏమేమో అనుకున్నాం. ఇలా అయిందేమిటి అని మధనపడుతున్నాను.
 
నా లెక్కలు అంత తేడా రావే. రెండో భాగం విషయంలో ఇంత తేడా చేశానా.. ఏంటి అని టోటల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. జస్ట్ సినిమా ఎండింగ్ సమయానికి రెండో థియేటర్‌కు వెళ్లాను. అక్కడ సౌండ్ బాగానే ఉంది. ఫర్వాలేదనుకున్నాను. సినిమా పూర్తయింది. వెనుకే డాక్టర్ వెంకట్ అని మా నిర్మాత శోభుగారి బ్రదర్. ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన వచ్చి నా వెనుకాల నిల్చున్నారు. సినిమా చూశారు. ఆయన కళ్లలో నీళ్లు, ఆగలేకపోతున్నారు. నా చెయ్యి పట్టుకుని మొత్తం షివర్ అవుతున్నారు. ఉద్వేగంతో వణికి పోతున్నారు. 
 
నిజం చెబుతున్నాను.. ఆ దృశ్యం ఇచ్చిన రిలీఫ్ అంతా ఇంతా కాదు. మనం ఏదయితే అనుకున్నామో ఆ ఎఫెక్టు  వచ్చింది మరి. ఇంకా చెప్పాలంటే ఆయన సినిమా మనిషి కాదు. అమెరికాలో పనిచేస్తున్న డాక్టర్ అంత ఎమోషనల్‌గా ఫీలవుతున్నారంటే.. భయంలేదు. బాహుబలి-2 సక్సెస్ అనుకున్నాను. 
 
తర్వాత యశ్‌రాజ్ ఫిలింస్‌లో కరణ్ జోహార్ తదితరులంతా సినిమా చూస్తున్నారు. అక్కడికి వెళ్లాం. వాళ్లయితే తెగపొగిడేస్తున్నారు. ఈ సినిమా ఇంత కాదు అంతకాదు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ బాంబే వాళ్ల పొగడ్తలంటే నాకు కొంచెం భయం. ఉన్నదానికంటే ఎక్కువ చెబుతుంటారు అనే భయం. వారి పొగడ్తలను నేను అంత ఎక్కువగా తీసుకోలేదు. సరిగ్గా రాత్రి 2.30 గంటలకు మా కజిన్ భార్య సీత మెసేజ్ పెట్టింది.  నంది అన్నా సినిమా సూపర్ అంటూ రెండు తంబ్స్ అప్ అని మెసేజ్ పెట్టింది. 
 
ఆమెది మహా మాస్ టేస్ట్. చందు అంటే మన చంద్రశేఖర్ ఏలేటి భార్య ఆమె. ఆయనేమో క్లాస్ సినిమాలు తీస్తాడు. ఈమెదేమో మాస్ టేస్ట్.  ఆమె మెసేజ్ వచ్చింతర్వాత ఇక భయం పోయింది. ఆ తర్వాత చాలా మంది చాలా కాంప్లిమెంట్లు పంపించారు కానీ నా భయాన్ని పోగొట్టిన కాంప్లిమెంట్ ఆమె చేసింది. అంతవరకు విపరీతమైన టెన్షన్,  ప్రెషర్‌లో ఉన్నాను. సినిమా సూపర్ అనే కాంప్లిమెంట్ ఆమె నుంచి విన్నాక ఇక నాకు నిద్రకూడా పోయింది. అంతవరకు పనితో నిద్రలేదు. ఆమె అభినందన తర్వాత ఉద్వేగంతో నిద్ర లేదు. అంటూ బాహుబలి 2 సినిమాపై తన టెన్షన్ మొత్తంగా పొగొట్టిన ఆ రెండు అనుభవాలను రాజమౌళి మీడియాతో పంచుకున్నారు.

ఏప్రిల్ 27న ముంబైలో జరగాల్సిన బాహుబలి-2 ప్రీమియర్ కార్యక్రమం రద్దయిందని పేపర్లలో చదివి చాలామంది అయ్యో అనుకున్నారు కానీ ఆ సినిమా విజయంపై రాజమౌళికి అమోఘమైన నమ్మకం కలిగించిన ఘటనలు ఆ రోజు రాత్రే జరిగాయన్న విషయం దాదాపు  నెలరోజుల తర్వాత చిత్ర దర్శకుడు రాజమౌళి స్వయంగా చెబితేనే తెలుస్తోంది మరి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments