Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో.. సింపుల్‌గా చెప్పేసిన సత్యరాజ్..?!

బాహుబని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్నకు ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌లో కట్టప్ప సమాధానమిచ్చాడు. "వెరీ సింపుల్.. నిర్మాతలు, శోభు సార్, ప్రసాద్ సార్ తనకు బాగా డబ్బు మట్టుబెట్టారు. ఇంకా రాజమౌళి చెప్పాడు..

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (17:57 IST)
బాహుబలి సినిమా తొలిభాగం రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు సమాధానం దొరకని ప్రశ్నంటూ ఒక్కటుందంటే.. అది "బాహుబని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనేదే. అయితే ఈ ప్రశ్నకు బాహుబలి ది కన్‌క్లూజన్ రిలీజ్ అయ్యేంతవరకు ఎవ్వరూ నోరెత్తకూడని బాహుబలి టీమ్‌కు ఆదేశించిన.. జక్కన్న రాజమౌళి.. ఆ సీక్రెట్‌ను బయటికి పొక్కనీయకుండా ఎన్నో జాగ్రత్తలు పడుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వమని, ప్రధానితో పాటు కొందరు కేంద్ర మంత్రులు రాజమౌళిని గెంజుకున్నా నోరెత్తలేదు. 
 
అయితే వారికి ఈ రహస్యం తెలిసిపోయి వుంటుందని.. దాన్ని వారు బయటికి చెప్పకుండా వుండేందుకు రాజమౌళి ప్రామిస్ తీసుకుని వుంటాడని కూడా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా బాహుబలిని వెన్నుపోటు పొడిచిన కట్టప్ప.. ఇందుకు సమాధానం ఈజీగా చెప్పేశాడు. ఆ సమాధానం ఏంటో తెలుసుకోవాలంటే.. చదవండి మరి. బాహుబలి2 ట్రైలర్‌లో నువ్వు పక్కనుండగా.. నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామ... అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ గుర్తుండే వుంటుంది. ఆ డైలాగ్ విన్నప్పటి నుంచి నెటిజన్లు.. బాహుబలిని చంపే మగాడు కట్టప్పనేనని.. ప్రభాస్ చెప్పకనే చెప్పాడని కామెంట్స్ చేశారు. 
 
ఈ విషయాన్ని పక్కనబెడితే.. "బాహుబని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్నకు ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌లో కట్టప్ప సమాధానమిచ్చాడు. "వెరీ సింపుల్.. నిర్మాతలు, శోభు సార్, ప్రసాద్ సార్ తనకు బాగా డబ్బు మట్టుబెట్టారు. ఇంకా రాజమౌళి చెప్పాడు.. "కిల్ బాహుబలి" (బాహుబలిని చంపమని).. అందుకే తాను చంపేశానని.. లేకుంటే తానెందుకు ప్రభాస్‌ను చంపుతాను" అని కట్టప్ప చెప్పాడు. ఇంకా చెప్పాలంటే..? ప్రభాస్ తన డార్లింగ్ కదా.. అని కట్టప్ప అనడంతో అందరూ నవ్వుకున్నారు. 
 
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సత్యరాజ్ ఈ కామెంట్స్ చేసినా.. సోషల్ మీడియాలో కట్టప్ప కామెంట్స్ వైరల్‌గా మారిపోయాయి. జాతీయ మీడియా సైతం కట్టప్ప కామెంట్స్‌ను హైలైట్స్ చేసేస్తున్నాయి. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి2 సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments