Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ లేకుంటే 'బాహుబలి' లేదు.. ప్రాజెక్టు కన్నా నేనేమీ గొప్ప వ్యక్తి కాను : రాజమౌళి

టాలీవుడ్ హీరో ప్రభాస్ లేకుంటే బాహుబలి చిత్రం లేదనీ దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి అన్నారు. అలాగే, ఈ ప్రాజెక్టు కన్నా తానేమీ గొప్ప వ్యక్తిని కాదని ఆయన వినమ్రయంగా చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (21:25 IST)
టాలీవుడ్ హీరో ప్రభాస్ లేకుంటే బాహుబలి చిత్రం లేదనీ దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి అన్నారు. అలాగే, ఈ ప్రాజెక్టు కన్నా తానేమీ గొప్ప వ్యక్తిని కాదని ఆయన వినమ్రయంగా చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో రాజమౌళితో పాటు..  చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులంతా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... తొలి భాగం తెరకెక్కించే సమయంలోనూ, విడుదలైన సందర్భంలోనూ చాలా చాలా భయం వేసింది. కానీ రెండో భాగంలో విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రెండేళ్లలో ‘బాహుబలి’కి విశేష ప్రజాదరణ లభించడమే అందుకు కారణం. ఎవరూ నిరుత్సాహానికి గురికారు. ప్రతీ ఒక్కరికీ ఆ ప్రశ్నకు సమాధానం కావాలన్నారు. 
 
ముఖ్యంగా.. ఈ సినిమా కోసం ప్రభాస్‌ కనబరిచిన అంకితభావాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇదే అతడ్ని చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోగా నిలబెడుతుంది. ప్రభాస్‌ వల్లే ‘బాహుబలి’ సాధ్యమైంది. మొత్తం మూడున్నరేళ్లు ఈ సినిమా కోసం కేటాయించాడు. అతను లేకుండా ఈ చిత్రం పూర్తి కాదు. ఈ చిత్రమే లేదన్నారు. 
 
అలాగే, నా కన్నా కూడా బాహుబలి సినిమా చాలా ఎక్కువ, సినిమా కన్నా బాహుబలి ప్రాంచైజీ ఇంకా పెద్దది. మేమిద్దరం ‘బాహుబలి’ అని భారీ నావలో ప్రయాణిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కన్నా నేనేమీ గొప్ప వ్యక్తి కాను అని రాజమౌళి చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments