Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి ''కిలికి కాలకేయ'' ప్రభాకర్‌కు హీరోగా నటించే ఛాన్సొస్తే..?!

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (16:48 IST)
మగధీరలో కాలభైరవగా రామ్ చరణ్ తేజను చూపించిన జక్కన రాజమౌళి బాహుబలిలో కాలకేయ పాత్రలో ప్రభాకర్‌ను చూపించి అందరినీ భయపెట్టేశారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పాత్ర కాలకేయ. విచిత్రమైన బాష, భయంకరమైన వేషధారణ, హింసాత్మకమైన ప్రవర్తనతో ఉండే కాలకేయ పాత్ర బాహుబలికి హైలైట్‌గా నిలిచింది. 
 
కాలకేయ పాత్రకు ఇట్టే అతుక్కుపోయిన ప్రభాకర్ ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. వార్ సన్నివేశం కోసం కాలకేయ గెటప్‌లో 40 రోజులకు పైగా పనిచేశానని చెప్పాడు. ఆ గెటప్‌ మేకప్‌కు దాదాపు 2 గంటలు పడుతుందని.. అదే గెటప్‌లో రోజంతా షూటింగ్ స్పాట్‌లో ఉండేవాళ్లమని వెల్లడించారు. మర్యాద రామన్న ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని.. ఆ తర్వాత అనుకోకుండా బాహుబలి ఛాన్స్ రావడం తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని, డిగ్రీ వరకు చదువుకుని అల్లరి చిల్లరిగా తిరుగుతుండిన తనకు రాజమౌళి ఇలాంటి అవకాశం ఇచ్చి ప్రేక్షకుల మధ్య మంచి పేరు సంపాదించిపెట్టేలా చేశారన్నారు.
 
బాహుబలి గెటప్ ఓకే కానీ హీరో అవకాశం వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు ప్రభాకర్ సమాధానమిస్తూ ఫక్కున నవ్వేశారు. అంతొద్దు అనేశారు. హీరోగా నటించే ఇంట్రెస్ట్, ఆశలు తనకు లేవన్నాడు. కాలకేయలో తన గెటప్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారని.. ఇక సినిమా చూశాక తన రోల్‌కు మంచి గుర్తింపు రావడం సంతోషంగా ఉందని ప్రభాకర్ చెప్పాడు. కాలకేయ గెటప్ వేశాక జ్వరమొచ్చేసిందన్నాడు. మర్యాదరామన్నతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన కిలికి కాలకేయ ఇమేజ్ బాహుబలి సినిమాతో డబుల్ అయ్యిందన్నమాట..!

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments