Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' పళని దర్శకత్వంలో 'ఏంజెల్'

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో నూతన దర్శకుడు బాహుబలి పళని దర్శకత్వంలో యువ నిర్మాత భువన్ సాగర్ నిర్మిస్తున్న సినిమా 'ఏంజెల్'. యూత్ స్టార్ నాగ అన్వేష్,

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (16:33 IST)
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో నూతన దర్శకుడు బాహుబలి పళని దర్శకత్వంలో యువ నిర్మాత భువన్ సాగర్ నిర్మిస్తున్న సినిమా 'ఏంజెల్'. యూత్ స్టార్ నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది. 
 
ఈ ప్రారంభోత్సవంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాత ఠాగుర్ మధు కెమెరా స్విచ్ అన్ చేయగా, నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సప్తగిరిలపై దర్శకుడు పళని ముహర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. 'పాతికేళ్లు కష్టపడి చదివి, మరో పాతికేళ్లు కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్‌మెంట్ ముందు సెటిలై.. ఆ తర్వాత లైఫ్‌ని లీడ్ చేసే క్యారెక్టర్ కాదురా నాది అని హీరో నాగ అన్వేష్ అనగా... 'నాది డిట్టో సేమ్ డైలాగ్' అని సప్తగిరి చెప్పగా వాళ్లతో జాయిన్ అవుతూ హీరోయిన్ హెబ్బాపటేల్.. 'అంత లేన్తీ డైలాగ్ నా వల్ల కాదురా బాబు.. ప్రపంచంలో ఉన్న ఎంజాయ్‌మెంట్ అంతా నాకే కావాలి.. అని అనగానే ఫస్ట్ షాట్‌ని దర్శకుడు పళని ఓకే చేశారు. 
 
ఈ కార్యక్రమంలో నిర్మాత సురేశ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ దర్శకుడు బాహుబలి పళని మాట్లాడుతూ.. మనం పాతికేళ్లు కష్టపడి చదివి, కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్డ్ మెంట్ ముందు సెటిలై ఆ తర్వాత లైఫ్‌ని లీడ్ చేస్తాం. కానీ ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ నానికి అంత పేషన్షీ లేదు. జీవితమన్నది పాస్ట్‌ని, ఈ షార్ట్ స్పాన్‌లో త్వరగా సంపాదించి త్వరగా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకునే కారెక్టర్. ఈ క్యారెక్టర్‌కి సరిపడే మరో ఫ్రెండ్ క్యారెక్టర్ సప్తగిరి. అలాంటి వీళ్ల మధ్యలోకి ఓ అమ్మాయి చేరుకుంటుంది. ప్రపంచలో ఉన్న సంతోషాన్నంతా అనుభవించాలనుకునే క్యారెక్టర్. అలా ముగ్గురు ఒక జోష్ ఫుల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు హీరో, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సడెన్‌గా ఒక ప్రమాదంలో ఇరుక్కుంటారు. ఈ ప్రమాదం వాళ్ల మధ్యనున్న అమ్మాయే అనే విషయం తెలుసుకుంటారు. చివరకు వీళ్ళు ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటారన్నదే ఈ చిత్రం. ఆ ప్రమాదానికి కారణం ఒక కొత్త పాయింట్. ఇది కామెడీ, ఫాంటసీ, థ్రిల్స్‌తో కూడి ఉంటుంది. ఎలా మొదలై ఎలా సంతోషంగా ముగిసిదన్నది ఏంజెల్ కథని తెలిపారు. 
 
నిర్మాత భువన్ సాగర్ మాట్లాడుతూ.. మొత్తం మూడు షెడ్యూల్స్‌లో, హైదరాబాద్, కోనసీమలో షూటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా నిర్మాత భువన్ సాగర్ చెప్పారు. హీరో నాగ అన్వేష్ మాట్లాడుతూ.. "చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలో పెరగడం వల్ల సినిమాల్లో నటించాలనే అభిలాష మొదటి నుంచీ ఉంది. బాలనటుడిగానే వెంకటేశ్‌ వంటి గ్రేట్ యాక్టర్‌తో నటించే ఛాన్స్ రావడమే అదృష్టంగా భావిస్తున్నాను... 'ఏంజెల్'లోని కథ, కథనం ఎంతో వైవిధ్యంగా ఉంటాయి... ఈ సినిమాతో మిమ్మల్ని ఆకట్టుకుంటానని ఆశిస్తున్నాను... ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్... అని అన్నారు. 
 
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే ఏంజెల్ ఓ పెద్ద హిట్టు అవ్వాలని, త్వరలోనే ఓ అద్భుతమైన క్యారెక్టర్‌తో ప్రేక్షకుల్ని మరింతగా అలరించబోతున్నట్లు తెలిపారు. నటడు సప్తగిరి మాట్లాడుతూ... ఈ సినిమాలో హీరో నాగ అన్వేష్‌తో ట్రావెల్ అయ్యే ఫుల్‌లెంత్ రోల్ చేస్తున్నానని, అద్యంతం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే రీతన ఏంజెల్ స్టోరీ రెడీ అయిందని.. అభిమానులకి కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments