Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిని పైరసీ భూతం పట్టకూడదు, థియేటర్లో చూడండి: రాజమౌళి

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (12:58 IST)
''బాహుబలి''ని పైరసీ భూతం పట్టకూడదంటూ దర్శకుడు రాజమౌళి అన్నారు. చిత్రం షూటింగ్ నుంచి లీకులతో విసిగిపోయిన జక్కన్న బాహుబలి థియేటర్లో చూడాల్సిన సినిమా అంటూ పైరసీలో చూడకండని పిలుపునిచ్చారు. జులై 10న 'బాహుబలి' చిత్రం విడుదల అవుతుందని...కేవలం థియేటర్లలోనే చిత్రాన్ని చూడండని ప్రేక్షకులను కోరారు. పెద్ద సినిమా, పెద్ద తెరపై చూడాల్సిన సినిమా బాహుబలి అని మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలిపారు. 
 
ఎవరు ఎక్కడ పైరసీ చేసినా....వెంటనే తెలిసిపోతుందన్నారు. పైరసీ జరుగకుండా థియేటర్‌ యజమానులు చర్య తీసుకోవాలని రాజమౌళి డిమాండ్ చేశారు. సెకండ్‌షో తర్వాత థియేటర్లలో పైరసీ జరుగుతోందని రాజమౌళి తెలియజేశారు.
 
మరోవైపు తెలుగువారు గర్వపడేలా 'బాహుబలి'ని నిర్మించారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. మంగళవారం బాహుబలి చిత్రంపై సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. బాహుబలి కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని తెలిపారు. రెండున్నరేళ్ల పాటు కష్టపడి 'బాహుబలి'ని నిర్మించారని...దయచేసి ఎవరూ పైరసీకి పాల్పడవద్దని అల్లు అరవింద్‌ విజ్ఞప్తి చేశారు.
 
సర్వీసు ప్రొవైడర్‌ నుంచి రక్షణ కోసం కోర్టు ఆర్డర్లు ఇచ్చిందని అల్లు అరవింద్ తెలిపారు. బాహుబలి పైరసీ వస్తే...మానిటరింగ్‌ సెల్‌కు ఫోన్‌చేయాలని వినతి చేశారు. ఉద్దేశపూర్వకంగా పైరసీ చేస్తే థియేటర్లపై ఏడాది నిషేధం తప్పదని అల్లుఅరవింద్‌ హెచ్చరించారు.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments