Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా’’ - బాహుబలి-2 ట్రైలర్ ఇదే...

భారతీయ చలనచిత్ర రంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన "బాహుబలి 2" ట్రైలర్‌ను గురువారం ఉదయం విడుదల చేశారు.

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (09:48 IST)
భారతీయ చలనచిత్ర రంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన "బాహుబలి 2" ట్రైలర్‌ను గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ప్రభాస్, రానా మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలను చూపించారు. 
 
పైగా ‘‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా’’ అని బాహుబలి కట్టప్పను ఉద్దేశించి చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం ఉత్కంఠ రేపుతుంటే, ఇప్పుడు ఈ డైలాగ్ ఆ కుతూహలాన్ని మరింత పెంచింది. 
 
బాహుబలి ఇంతగా నమ్మిన కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం మరోసారి చర్చనీయాంశమైంది. మొత్తం మీద ట్రైలర్ యూట్యూబ్‌లో ఓ సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించారు.
 
అంతేకాకుండా, ఇందులో ప్రభాస్ డైలాగులు అద్భుతంగా ఉన్నాయి... "అమరేంద్ర బాహుబలి అనే నేను.. మహిష్మతి రాజ ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు ప్రాణత్యాగం చేసేందుకు వెనుకంజ వేయను, ఇది రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా" అంటూ ప్రమాణం చేస్తున్నారు.  
 
ఇందులో అనుష్కను ఎంతో అందంగా చూపించారు. అలాగే, కట్టప్పతో పాటు.. రానా, నాజర్‌లో ఆక్రోశం, యుద్ధ సన్నివేశాలు, మహిష్మతి రాజ్యాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments