Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2కి ఐమాక్స్‌ హంగులు.. ప్రాంతీయ భాషా చిత్రంలో మూడోది.. జక్కన్న ప్లాన్ అదుర్స్..!

బాహుబలి-2 సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ట్రైలర్‌ లైక్స్, వ్యూస్, షేర్ల స్కోర్ పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 చిత్రాన్ని

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (18:06 IST)
బాహుబలి-2 సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ట్రైలర్‌ లైక్స్, వ్యూస్, షేర్ల స్కోర్ పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 చిత్రాన్ని ఇక ఐమాక్స్ ఫార్మాట్‌లో డిజిటలైజ్ చేసి ఐమాక్స్ థియేటర్స్‌లో విడుదల చేసే యోచనలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఆపై అదనపు సాంకేతిక హంగులు జోడించి అంతర్జాతీయ మార్కెట్లలో రిలీజ్ చేయాలనే ప్రతిపాదన కూడా ఉందని జక్కన్న టీమ్ వర్గాల సమాచారం. 
 
హైదరాబాద్‌లోని సినీమాక్స్ థియేటర్లో బాహుబలి-ది కన్ క్లూజన్ ట్రైలర్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఐమాక్స్ ఫార్మాట్‌తో పాటు సినిమా ఇమేజ్‌లను రికార్డు చేయడంతో పాటు గ్రేటర్ సైజులో డిస్ ప్లే చేయడంపై కూడా జక్కన్న దృష్టి పెట్టాడు. తద్వారా ఐమాక్స్‌లో విడుదలయ్యే భారతీయ ప్రాంతీయ భాషా చిత్రాల్లో ఇది మూడోదని ఐమాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో గ్రెగ్ ఫాస్టర్ చెప్తున్నారు. దీంతో పాటు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీకి కలిసి పనిచేయడం ఎంతో హ్యాపీగా ఉందని చెప్పారు. 
 
మరోవైపు 'బాహుబలి-1'తోపాటే, 'బాహుబలి-2'లోనూ కొంత పార్ట్‌ చిత్రీకరించడంలో కథలో పాత్రల తీరుతెన్నుల్లో ఎక్కువ మార్పులు చేయడానికి వీలుపడదని రాజమౌళి ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు. తొలి పార్ట్‌ పాత్రల పరిచయం కోసమే అన్నట్లుగా వుంటుందనీ, రెండో పార్ట్‌లో డ్రామా ఎక్కువగా వుంటుందనీ, ఎమోషన్స్‌ పీక్స్‌లో వుంటాయనీ, పోరాట సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా వుంటాయనీ జక్కన్న వెల్లడించాడు. అన్నిటికీ మించి, మాహిష్మతి రాజ్యం తొలి పార్ట్‌లో తక్కువగా వుంటే, రెండో పార్ట్‌లో చాలా ఎక్కువగా వుంటుందని రాజమౌళి వ్యాఖ్యానించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments