Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీటీ స్లిమ్ అయ్యింది.. అమరేంద్ర బాహుబలితో పాట పాడుకుంటోంది..

బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులు తిరిగి

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (18:55 IST)
బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులు తిరిగి చూసేలా చేసిన రాజమౌళి.. బాహుబ‌లి2 మూవీ కోసం వేయి కనులతో ఎదురుచూస్తున్నారు.  
 
బాహుబలి-ది బిగినింగ్‌కు "ది కన్ క్లూజన్'' జతచేసే పనిలో బిజీగా రాజమౌళి.. ఇప్పటికే క్లైమాక్స్ షూట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సాంగ్ షూట్ మొదలుపెట్టాడు. ఎన్ని రోజులు యుద్దాలు, పోరాటాలతో ఒళ్ళు హూనం చేసుకున్న అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) ప్రస్తుతం ఎంచక్కా దేవసేనతో పాట పాడుకుంటూ స్టెప్పులేసుకుంటున్నాడు. 
 
రామోజీ ఫిలిం సిటీలో మూడు నెలలు కేవలం క్లైమాక్స్‌తో గడిపిన రాజమౌళి, ప్రస్తుతం పాటల చిత్రీకరణ ప్రారంభించాడు. ప్రస్తుతం అనుష్క, ప్రభాస్‌లపై సాంగ్ షూట్ జరుగుతుంది. మరోపక్క కీరవాణి సైతం రీ రికార్డింగ్ పనులు పూర్తి చేసాడు. అనుష్క బరువు తగ్గడం కోసం ఇన్నాళ్లు వేచి చూసిన రాజమౌళి.. ప్రస్తుతం అమ్మడు స్లిమ్ కావడంతో పాటల చిత్రీకరణ స్టార్ట్ చేశాడు. ఈ పాటలు పూర్తికాగానే సిజి వర్క్ ప్రారంభం కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకుని సినిమాను 2017 ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేసేందుకు జక్కన్న రంగం సిద్ధం చేస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments