Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సీన్‌కు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి.. 'బాహుబలి' స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్

ఈనెల 28వ తేదీన విడుదలైన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఒకవైపు అభిమానుల నీరాజనాలు అందుకుంటూనే.. మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విజయంతో పాటు.. పలు సన్నివేశాల

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (08:20 IST)
ఈనెల 28వ తేదీన విడుదలైన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఒకవైపు అభిమానుల నీరాజనాలు అందుకుంటూనే.. మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విజయంతో పాటు.. పలు సన్నివేశాలపై చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సినిమా విశ్రాంతి ముందు వచ్చే సన్నివేశానికి హీరో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనకు స్ఫూర్తి అని వెల్లడించడం ఇపుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా భళ్లాల దేవుడికి పట్టాభిషేకం జరిగినా, అతను తృప్తిగా ఉండలేడని, బాహుబలికే ప్రజామద్దతు ఉందని, అతనికే ప్రజలు నీరాజనాలు పలుకుతుంటారని, ఓ కాన్సెప్ట్‌ను అనుకున్నామని, ఇక దీన్ని తెరపైకి ఎలా ఎక్కించాలా అని మథనపడుతూ వచ్చాం. ఓ రోజున అనుకోకుండా టీవీ ఆన్ చేస్తే.. ఓ ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో లైవ్ వస్తోంది. 
 
ఆ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ లేడని, కానీ పవన్ పేరు వినిపించినప్పుడల్లా, అభిమానులు వెర్రిగా ఊగిపోతూ, ఆపై ఐదు నిమిషాల పాటు ఎవరు ఏమి మాట్లాడినా వినిపించలేదని చెప్పాడు. వేదికపై ఉన్న హీరోలంతా అసూయపడే ఆ పరిస్థితిని చూసి, ఇదేదో బాగుందని, వెంటనే విశ్రాంతి సన్నివేశాన్ని రాసుకున్నానని, ఆ విధంగా ఇంటర్వెల్ సీన్‌కు పవన్ కల్యాణ్ స్ఫూర్తి అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments