Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న శివగామి, శ్రీదేవి నిద్రపోవడం లేదట...

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాహుబలి రికార్డు. రూ. 1000 కోట్ల నుంచి రూ. 1500 కోట్లకు పరుగు. అనూహ్యమైన విజయం. ఆ చిత్రంలో నటించిన ప్రతి నటుడికి భారీగా పొగడ్తలు, అవకాశాలు. నటించిన ప్రతి నటి, నటుడు ఇలాంటి చిత్రంలో నటించినందుకు కళాకారుడిగా తమ జన్మ ధన్యమైందనే

Webdunia
సోమవారం, 8 మే 2017 (14:13 IST)
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాహుబలి రికార్డు. రూ. 1000 కోట్ల నుంచి రూ. 1500 కోట్లకు పరుగు. అనూహ్యమైన విజయం. ఆ చిత్రంలో నటించిన ప్రతి నటుడికి భారీగా పొగడ్తలు, అవకాశాలు. నటించిన ప్రతి నటి, నటుడు ఇలాంటి చిత్రంలో నటించినందుకు కళాకారుడిగా తమ జన్మ ధన్యమైందనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన రాజమాత శివగామి. ఈ పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. అందరి మన్ననలను అందుకుంటోంది. 
 
ఐతే ఈ పాత్రలో నటింపజేయడానికి తొలుత రాజమౌళి సంప్రదించింది శ్రీదేవినే. ఐతే శ్రీదేవి పాత్రను రిజెక్ట్ చేసింది. దీనికి కారణం... ఒకటి ప్రభాస్ కి తల్లిగా నటించడం మరొకటి రూ. 6 కోట్ల భారీ రెమ్యునరేషన్ డిమాండ్. ఈ రెండు డిమాండ్ల కారణంగా రాజమౌళి వెనక్కి తగ్గి రమ్యకృష్ణకు ఆ పాత్రను ఇచ్చేశారు. ఐతే ఇప్పుడు ప్రపంచస్థాయిలో బాహుబలి విజయం, అందులో నటించిన శివగామి క్యారెక్టర్‌‍కు ప్రశంసలు వింటున్న శ్రీదేవికి నిద్రపట్టడం లేదట. 
 
డబ్బు సంగతి తర్వాత తను వచ్చిన ఛాన్సును కాలదన్నుకుని తప్పుచేశానని ఆవేదన వ్యక్తపరుస్తోందట. జీవితంలో ఇలాంటి గోల్డెన్ ఛాన్సును మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడుతోందట. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం వుండదు కదా... ఏదయినా అవకాశం వచ్చి తలుపు తట్టినప్పుడే దాన్ని ఆబగా పట్టేసుకోవాలి. లేదంటే ఇక అది జీవితంలో ఎన్నటికీ దక్కదు అనేందుకు ఇలాంటి ఉదాహరణే నిదర్శనం.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments