Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బెస్ట్ డైరక్టర్ రాజమౌళి కాదు.. పెళ్లిపై స్వీటీ చెప్పిందే నా మాట : బాహుబలి హీరో ప్రభాస్

తన పెళ్లిపై జరుగుతున్న దుష్ప్రచారానికి 'బాహుబలి' ప్రభాస్ స్పందించారు. బాహుబలి-2 తమిళ ఆడియో వేడుక ఆదివారం రాత్రి చెన్నైలో జరిగింది. అంతకుముందు ప్రభాస్ మాట్లాడుతూ... ‘బాహుబలి’తో యావత్ భారతదేశం గొప్పగా క

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (08:52 IST)
తన పెళ్లిపై జరుగుతున్న దుష్ప్రచారానికి 'బాహుబలి' ప్రభాస్ స్పందించారు. బాహుబలి-2 తమిళ ఆడియో వేడుక ఆదివారం రాత్రి చెన్నైలో జరిగింది. అంతకుముందు ప్రభాస్ మాట్లాడుతూ... ‘బాహుబలి’తో యావత్ భారతదేశం గొప్పగా కీర్తిస్తున్న దర్శకధీరుడు రాజమౌళి కన్నా తనకిష్టమైన దర్శకులు ఇద్దరున్నారన్నారు. 
 
ఆ ఇద్దరు దర్శకులు మరెవరో కాదు.. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం, తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన బాపు అని తెలిపారు. ఇకపోతే.. 'నేను మొదట మణిరత్నంగారికి వీరాభిమానిని. అలాగే తెలుగులో బాపుగారిని అభిమానిస్తా. ఇప్పుడు రాజమౌళి. ఒక్కరి పేరే చెప్పమంటే మణిరత్నం పేరే చెబుతాను. అంత ఇష్టం ఆయన సినిమాలంటే. ఈ విషయం రాజమౌళికీ తెలుసు' అని చెప్పారు. 
 
ఇకపోతే... ‘బాహుబలి 2’ పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. ఈ విషయంలో తనది స్వీటీ అనుష్కది ఒక్కటే సమాధానమన్నారు. పెళ్లి ప్రస్తావన వచ్చినపుడల్లా స్వీటీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో... తనది కూడా అదే ఆన్సర్ అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments