Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతం తీయాలన్నదే నా లక్ష్యం.. బాహుబలి కంటే ఈగ చేయడం పనికొచ్చింది: జక్కన్న

జక్కన్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి 2' . ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించిన 'బాహుబలి' ది బిగినింగ్‌కు ఇది కొనసాగింపుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (10:46 IST)
జక్కన్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి 2' . ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించిన 'బాహుబలి' ది బిగినింగ్‌కు ఇది కొనసాగింపుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాహుబలి 2 ట్రైలర్‌ను 'రయీస్‌'తో పాటు విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ''బాహుబలి 2' ట్రైలర్‌ 'రయీస్‌'తో జతచేసి విడుదల చేస్తున్నారని వచ్చిన పుకార్లను సినిమా యూనిట్ ఖండించింది. ఈ నేపథ్యంలో బాహుబలి 2 గురించి రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబ‌లికంటే ముందు ఈగ చిత్రం చేయ‌డం త‌న‌కు ఎంతో ఉప‌క‌రించింద‌ని చెప్పాడు. 
 
సినిమా బాగుంటే ప్రేక్ష‌కులు భాష‌తో సంబంధం లేకుండా వీక్షిస్తారని, ప్రేక్ష‌కుల‌ను బాహుబ‌లిలోకంలోకి తీసుకువెళ్లాల‌నే ఆలోచ‌న‌తోనే చాలా ఇష్ట‌ప‌డి ఈ సినిమాను చేసిన‌ట్లు రాజ‌మౌళి చెప్పారు. అమర చిత్ర కథల నుంచే తను ప్రేరణ పొందేవాడినని, ఈ అమర చిత్రకథ పుస్తకాలు ఈ రోజుటికీ చదువుతానని రాజమౌళి చెప్పుకొచ్చారు. సినిమా అవుట్ పుట్ స‌రిగ్గా వ‌చ్చేందుకు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని జ‌క్క‌న్న చెప్పాడు. 
 
ఇక.. మ‌హాభార‌తం సినిమా తీయాల‌న్న‌దే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు రాజమౌళి అన్నారు. చెన్నైలో ఓ జాతీయ ఛానెల్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో బాహుబ‌లి టీమ్ పాల్గొని ఆ భారీ సినిమాకు సంబంధించి కొన్ని విశేషాల‌ను పంచుకున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)

వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ తీగ.. బాలుడిని అలా కాపాడిన యువకుడు (video)

కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments