Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2 సెన్సార్ రివ్యూ రిపోర్ట్- 5/5 మార్కులు ఖాయం.. దేవసేన కట్టప్ప కూతురట!

బాహుబలి సినిమా ఏప్రిల్ 28వ తేదీన (శుక్రవారం) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి ది కన్‌క్లూజన్‌ తెరకెక్కనున్

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (13:57 IST)
బాహుబలి సినిమా ఏప్రిల్ 28వ తేదీన (శుక్రవారం) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి ది కన్‌క్లూజన్‌ తెరకెక్కనున్న సంగతి విదితమే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా రివ్యూ లీక్ అయ్యింది. 
 
ఈ సినిమాను ఇప్పటికే చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు ఫుల్ మార్కులు వేశారు. ఐదుకు ఐదు అంటూ చెప్పేశారు. తాజాగా కేంద్ర సెన్సార్ సభ్యులొకరు.. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదాపు మూడు గంటల పాటు ఈ సినిమా సాగుతుందన్నారు. ఒక్క కట్ చెప్పకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. 
 
హాలీవుడ్ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 కంటే బాహుబలి 2 బాగుందని చెప్పారు. యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా వున్నాయని ప్రశంసల జల్లు కురిపించారు. ఈ దశాబ్ధపు అతిపెద్ద సినిమా ఇదవుతుందని.. థియేటర్‌లోనే ఈ సినిమా చూస్తే విజువలైజేషన్ ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్, రానాలు రెండు నట సింహాలు పోటీ పడిన తీరును చూపారని అన్నాడు. కొన్ని సీన్లలో చూస్తున్న ప్రేక్షకులు కంటతడి కూడా పెడతారని సెన్సార్ సభ్యుడు చెప్పుకొచ్చారు.

ఇకపోతే.. సోషల్ మీడియాలో బాహుబలికి చెందిన కీలక సీన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రానాకు రాజమాత శివగామి స్వయంగా పట్టం కడుతున్న సీన్ చక్కర్లు కొడుతుండగా, ఈ చిత్రానికి చెందిన కథ కూడా లీకైపోయింది. అంతేగాకుండా దేవసేన (అనుష్క) కట్టప్ప కూతురేనని తేలింది. ఇదే ప్రస్తుతం బాహుబలి2లో అతిపెద్ద సీక్రెట్ అంటూ నెటిజన్లు పోస్టులను షేర్ చేసుకుంటున్నారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments