Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనితర (అ)సాధ్యం బాహుబలి రికార్డు... రూ.1500 కోట్ల క్లబ్‌లో.. 'రోబో' గల్లంతుతో రజనీ ఆశ్చర్యం

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం "బాహుబలి 2 ది కంక్లూజన్". ఏప్రిల్ 28వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి

Webdunia
మంగళవారం, 16 మే 2017 (17:13 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం "బాహుబలి 2 ది కంక్లూజన్". ఏప్రిల్ 28వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో నమోదైవున్న రికార్డులను బద్ధలుకొడుతూ... అనితర సాధ్యమైన రికార్డులను సాధిస్తూ దూసుకెళ్తోంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో 9000 థియేటర్లలో విడుదలై 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. 'సర్కార్-3', 'మేరీ ప్యారీ బిందు' వంటి బాలీవుడ్ చిత్రాలు విడుదలైనా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమ ముందు నిలబడలేక పోయాయి. 
 
కేవలం తెలుగు, తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లోనే కాకుండా, హిందీలో సైతం 'బాహుబలి-2: ద కన్ క్లూజన్'కి ఎదురేలేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలై 20 రోజులు పూర్తి కాకుండానే 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా, ప్రస్తుతానికి ఏకైక భారతీయ సినిమాగా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా నిలిచింది. 
 
ఇంకోవైపు.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరిట ఉన్న రికార్డులన్నీ బద్ధలైపోయాయి. తమిళ చిత్ర ప‌రిశ్ర‌మలో అత్య‌ధిక కలెక్షన్స్ రూ.105 కోట్లు సాధించిన మూవీగా సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ నటించిన ఎంథిరన్ (రోబో) చిత్రం ఉంది. ఈ సినిమా విడుద‌లై ఏడేళ్ల‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు త‌మిళ చిత్ర ప‌రిశ్రమ‌లో ఆ సినిమాపై ఉన్న అత్య‌ధిక వ‌సూళ్ల‌ను బాహుబ‌లి-2 తుడిచిపెట్టేసింది. పైగా, శరవేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా బాహుబలి నిలిచింది. 
 
'బాహుబలి-2' విడుద‌ల రోజే రజనీకాంత్ 'కబాలి', విజయ్ 'భైరవ'ల రికార్డులని బ‌ద్ధలు కొట్టగా, ఇపుడు తమిళనాడు రాష్ట్రంలోనూ అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా బాహుబ‌లి-2 మ‌రో ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. పైగా, ఇప్పటికీ ఈ చిత్రం ఇప్పటికీ 90 శాతం ఆకుపెన్సీతో ప్రదర్శించబడుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలలో బాహుబలి-2 చిత్రం 285 కోట్లకి పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా, కేర‌ళ‌లో 50 కోట్లు కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ లో 434.80 కోట్ల వసూళ్ళు సాధించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments