Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో తల్లిగా నాగార్జున హీరోయిన్.. ఎవరు?

వెండితెరపై అలా కనిపించి.. ఇలా మాయమయ్యేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అయేషా జుల్కా. ప్రస్తుతం ఈమె రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదీ కూడా హీరోయిన్‌గా కాదు సుమా.. ఓ హీరోకు తల్లిగా. సాధారణంగా, చిత్రపరిశ్ర

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (13:23 IST)
వెండితెరపై అలా కనిపించి.. ఇలా మాయమయ్యేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అయేషా జుల్కా. ప్రస్తుతం ఈమె రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదీ కూడా హీరోయిన్‌గా కాదు సుమా.. ఓ హీరోకు తల్లిగా. సాధారణంగా, చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోలు అయితే వయసు మీదపడుతున్నా నటిస్తూనే ఉంటారు. వారికి సినీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ, హీరోయిన్ల విషయంలో అంతా రివర్స్. మూడు పదుల వయసు దాటగానే అవకాశాలు సన్నగిల్లిపోతాయి.
 
నలభైకి వచ్చే సరికి ప్రధాన పాత్రల స్థానంలో సైడ్ క్యారెక్టర్లు వస్తాయి. ముఖ్యంగా, అమ్మ, అక్క, అత్త వంటి పాత్రలకే పరిమితం కావాల్సి ఉంటుంది. కొన్నేళ్ళపాటు స్టార్ హీరోయిన్‌గా ఉండి చివరికి చిన్నచిన్న పాత్రలు చేయలేక పెళ్లి చేసుకుని స్థిరపడిపోతుంటారు. అలాంటి పరిస్థితి అయేషాకు లేకపోయినప్పటికీ.. ఆమెకు సరైన సినీ అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇపుడు రీఎంట్రీ ఇవ్వనున్నారు. 
 
నాగార్జున హీరోగా 1990లో వచ్చిన చిత్రం నేటి సిద్దార్ధ. ఈ చిత్రంలో 'ఓసి మనసా' అనే పాటలో నాగార్జునతో కలిసి స్టెప్పులు వేసిన భామ అయోషా జుల్కా. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించింది. ఇటు తెలుగుతో పాటు హిందీలో అమీర్ ఖాన్‌తో కొంతకాలం దుమ్ము రేపింది. 2010లో వచ్చిన 'అదా' సినిమా తర్వాత వెండితెర నుంచి దూరమైంది. అలా సుమారు దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 
 
ఎనిమిదేళ్ల తరువాత ఇప్పుడు అనీల్ శర్మ దర్శకత్వం వహిస్తున్న 'జీనియస్' అనే బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నదట. హీరోయిన్‌గా మాత్రం కాదు. హీరోయిన్ తల్లిగా కనిపించబోతుంది. అదేసమయంలో మీడియాకు కనిపించిన అయోషా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నపుడు ఫిజిక్‌ను కాపాడుకుంటూ ఉండే తారలు.. ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాక ఎందుకు లావుగా మారిపోతారో అర్ధం కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments