Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీక్రెట్‌గా హీరోయిన్ పెళ్లి... ఎవరో తెలుసా?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (11:49 IST)
'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆర్తి చాబ్రియా. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి సినిమాలలో హీరోయిన్‌గా చేసి, చింతకాయల రవిలో ఐటెమ్ సాంగ్ చేశారు. మూడేళ్ల వయసు నుండే ఆమె దాదాపు 300ల పైచిలుకు టీవీ యాడ్స్‌లో నటించింది. 


ఇంకా మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2000 పజెంట్ విజేతగా కూడా నిలిచింది. అంతేకాకుండా కొన్ని మ్యూజిక్ వీడియోలు చేసిన ఆమె 2001లో ‘ఫియర్ ఫ్యాక్టర్-ఖత్రోంకి ఖిలాడి' 4వ సీజన్ విజేతగా నిలిచింది. 2013లో చివరిగా ఓ పంజాబీ చిత్రం చేసిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు.
 
తాజాగా ఆర్తి చాబ్రియా పెళ్లి ఫోటోలు నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఎంతో కాలంగా బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్న విశరద్ బీడసేతో మూడు ముళ్లు వేయించుకున్నారు. కానీ ఈ పెళ్లి విషయం మీడియాకు తెలియకుండా ఎంతో గోప్యంగా వ్యవహరించడం గమనార్హం.

ముంబైలో సోమవారం (జూన్ 24)న ఈ వివాహ వేడుకలు జరిగినట్లు, ఇందులో కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. వివాహానికి హాజరైన ఆర్తి చాబ్రియా సన్నిహితులు వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు తెలిసింది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. 
 
విశరద్ బీడసేకి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఇంటర్నేషనల్ టాక్స్ కన్సల్టెంట్. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పని చేస్తున్న విశరద్ కొంత కాలంలో ఇండియాకు షిప్ట్ అవుతారని, ముంబైలో కొత్త కాపురం పెట్టబోతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments