Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరాలా...? నీకిది అవసరమా...? బాబు బాగా బిజీ... ఈ రకంగానా...?

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ నుండి స్క్రీన్ రైటింగ్‌లో డిప్లొమా... న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో సంవత్సరం కోర్సు వంటి పలు ఘనత వహించిన కోర్సులు చేసి, తన పేరు కనిపిస్తే .. హాయిగా నవ్వుకోవచ్

Webdunia
గురువారం, 4 మే 2017 (17:03 IST)
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ నుండి స్క్రీన్ రైటింగ్‌లో డిప్లొమా... న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో సంవత్సరం కోర్సు వంటి పలు ఘనత వహించిన కోర్సులు చేసి, తన పేరు కనిపిస్తే .. హాయిగా నవ్వుకోవచ్చు అని ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లలో అడుగుపెట్టేంతలా నటుడిగా, దర్శకుడిగా పేరు సంపాదించుకుని ఇప్పుడేమో 'బాబూ బాగా బిజీ' అంటూ ఊర అడల్ట్ కంటెంట్‌తో హడలెత్తిస్తున్నాడు శ్రీనివాస్ అవసరాల. 
 
హంటర్ అనే హిందీ సినిమాకు అనువాదంగా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్ర దర్శకుడు నవీన్. అవసరాల సరసన శ్రీముఖి, మిష్టి చక్రవర్తి, తేజస్వి, సుప్రియలు నటిస్తున్న ఈ చిత్రంలో ద్వందార్థాలకు, శృంగార సన్నివేశాలకు కొదవ లేదని ఇప్పటికే విడుదలైన టీజర్లతో తేలిపోయింది. హీరోయిన్లను ఘాటుగా, మోటుగా వాడేసిన ఈ సినిమా వెనుకటి షకీలా సినిమాలను జ్ఞాపకం చేస్తోందంటున్నారు టీజర్లు, ఫస్ట్ లుక్‌లు చూసిన సినీ ప్రియులు. 
 
గాఢమైన అధర చుంబనాలు, లోదుస్తుల్లో గ్లామర్ ఒలకబోయడాలు, అనాచ్ఛాదిత వీపుని కెమెరా కంటికి అప్పగించేయడాలు, చీరను పైకెత్తే సన్నివేశాలతో పాటు పువ్వుని ఒలిచిన అరటిపండు ఆకర్షించేందుకు ప్రయత్నించడం వంటి సీన్లతో ఫక్తు సి గ్రేడ్ సినిమాలా అనిపిస్తున్న ఈ బాబు బాగా బిజీ చిత్రం సెన్సార్‌ను సైతం పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జయాపజయాలపై ఆధారపడి, మరిన్ని హాలీవుడ్, బాలీవుడ్ తరహా అడల్ట్ సినిమాలు మరిన్ని తెలుగు వెండితెరపై వస్తాయేమో చూడాలి మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments